సోషల్ మీడియాను( Social Media ) ఉపయోగించుకుని కొందరు రాత్రికి రాత్రే ఫేమస్ అవుతున్నారు.తమ టాలెంట్ బయటపెట్టి ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకుంటుంటారు.
అయితే ఇంకొందరు అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు.ప్రతిరోజూ సోషల్ మీడియాలో వివిధ రకాల వింత కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా చిలుకల విక్రయాల కేసు వైరల్ అవుతోంది.తన యూట్యూబ్ ఛానెల్‌లో చిలుకలను విక్రయిస్తున్న అస్సాం యూట్యూబర్‌ను( Assam youtuber ) పోలీసులు అరెస్టు చేశారు.
అస్సామ్‌లోని కోక్రాజర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.తన యూట్యూబర్ ఛానెల్‌లో చిలుకలను( Parrots ) విక్రయిస్తున్నందుకు జాహిదుల్ ఇస్లాం అనే యూట్యూబర్‌ను అరెస్టు చేసినట్లు కచుగావోన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్‌ఓ) భను సిన్హా తెలిపారు.తనను గోసైగావ్ పోలీసులు పట్టుకున్నారని, తరువాత అటవీ శాఖకు అప్పగించారని చెప్పారు.
జంతు సంరక్షణ కోసం పాటుపడే పెటా సంస్థ ఫిర్యాదు ఆధారంగా నిందితుడు జాహిదుల్ ఇస్లాంను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 కింద, చిలుకలను పట్టుకోవడం, అమ్మడం చట్టవిరుద్ధం.ప్రాసెస్ చేసిన చక్కెర బిస్కెట్లను “ఎడ్యుకేషనల్” కంటెంట్ తయారుచేసే సాకుగా కలపడం ద్వారా ఆ యూట్యూబర్ చిలుకకు ఆహారంగా ఇచ్చేవాడు.ఇది చిలుకల ఆరోగ్యానికి హానికరమని పెటా పేర్కొంది.
చివరికి పోలీస్ కంప్లయింట్ ఇచ్చి ఆ యూట్యూబర్‌కు షాక్ ఇచ్చింది.