డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఆషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.
బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు లభించింది.దీంతో బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షో లలో సందడి చేసింది.
అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అందాలతో కుర్రాళ్ళని ఆకట్టుకుంటుంది.సోషల్ మీడియాలో గ్లామర్ డాల్ గా అషు గుర్తింపు పొందింది.

బిగ్ బాస్ షోలో పాల్గొన్న సమయంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో అషూ రెడ్డి నడిపిన ప్రేమాయణం అందరికీ తెలిసిందే.బిగ్ బాస్ షోలో వీరి ప్రవర్తన చూసి వీరిద్దరూ కచ్ఛితంగా పెళ్ళి చేసుకుంటారని అందరూ భావించారు.కానీ అందరి ఆలోచనలు తారు మారు చేస్తూ ఇద్దరు విడిపోయారు.ఇక గత కొంత కాలంగా కమెడియన్ ఎక్స్ప్రెస్ హరితో అషురెడ్డి సన్నిహితంగా ఉంటోంది .కామెడీ స్టార్స్ ఫేమ్ ఎక్స్ ప్రెస్ హరితో అషురెడ్డి ప్రేమలో పడిందని బుల్లితెర మీద రచ్చ చేశారు.ఇలా వీరిద్దరూ బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షో లలో ఒకవైపు కామెడీ స్కిట్స్ చేస్తూనే మరొకవైపు రొమాంటిక్ డ్యూయట్స్ పాడుకున్నారు.

అంతేకాకుండా హరి తన గుండెలపై అషురెడ్డి పేరును టాటూ వేయించుకున్నాడు.అలాగే సొంత డబ్బులతో హరికి బైక్ కూడా కొనిచింది.ఇక తాజాగా వీరిద్దరూ మరొకసారి వార్తల్లో నిలిచారు.తాజాగా వీరిద్దరూ కలిసి వాలెంటైన్స్ వేడుకలు జరుపుకున్నారు.వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న హరి-అషురెడ్డి ఇద్దరు కలిసి హెల్పింగ్ హ్యాండ్స్ హ్యుమానిటీ అనే ఆర్ఫాన్ హోమ్ కి వెళ్లారు.అక్కడే కేక్ కట్ చేసిన వాలెంటైన్స్ వేడుకల్లో పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను ఆషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ” మన వద్ద ఉన్న అపరిమితమైన ప్రేమను, లేని వాళ్లకు పంచాలి ” అంటూ అషురెడ్డి కామెంట్ చేసింది.అయితే వాలంటైన్స్ డే రోజున వీరిద్దరూ ఇలా కలిసి ఆర్ఫాన్ హోం లో వాలెంటెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకోవడంతో వీరి ప్రేమ వార్తలు మరింత వైరల్ అవుతున్నాయి.







