అష్టా చెమ్మా ఆటలో గొడవ..స్నేహితుడి దారుణ హత్య..!

మనం సరదాగా ఆడుకునే ఆటలలో కూడా కచ్చితంగా గెలవాలని తపన ఉంటుంది.ఒకవేళ ఓడిపోతే ఆట అన్నాక గెలుపు ఓటములు సహజం అని కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటే, ఇంకొంతమంది నెగటివ్ గా తీసుకుంటారు.

 Ashta Chemma's Fight In The Game.. Brutal Murder Of A Friend, Visakhapatnam, Ash-TeluguStop.com

నెగటివ్ గా తీసుకునేవారు గెలిస్తే, ఓడిన వారిని చాలా హేళన చేస్తుంటారు.

ఆట ముగిశాక హేళన కారణంగా స్నేహితుల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

కాలక్షేపం కోసం ఆడే ఆటలో మొదలైన చిన్న గొడవ చివరికి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన విశాఖపట్నం( Visakhapatnam )లో చోటు చేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

Telugu Friends, Latest Telugu, Visakhapatnam-Latest News - Telugu

వివరాల్లోకెళితే.విశాఖపట్నంలోని మద్దెలపాలెం కళాభారతి రోడ్డులో ఉండే కూరగాయల బజారు సమీపంలో ఉన్న సులబ్ కాంప్లెక్స్ వద్ద నలుగురు స్నేహితులు కాలక్షేపం కోసం సరదాగా అష్టా చెమ్మా ఆట( Ashta chemma game ) ఆడుకున్నారు.ఈ నలుగురు స్నేహితులు పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తూ సమయం దొరికినప్పుడల్లా సరదాగా ఈ ఆట ఆడుకుంటూ ఉంటారు.

తాజాగా నలుగురు స్నేహితులు పీకలదాకా మందు తాగి అష్టా చెమ్మా ఆట ఆడారు.

అక్కడ ఉన్న కేర్ టేకర్ రామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ ఆడొద్దు వెళ్ళిపొండి అని ఎన్నిసార్లు చెప్పినా వారు మాత్రం వినకుండా అక్కడే కూర్చొని ఆట ఆడారు.

Telugu Friends, Latest Telugu, Visakhapatnam-Latest News - Telugu

రామకృష్ణ వీళ్లు వినేలా లేరని వాళ్ళని పట్టించుకోకుండా తన పనిలో తన నిమగ్నమయ్యాడు.అయితే స్నేహితుల మధ్య మాట పెరిగి గొడవ కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.రాంబాబు అనే వ్యక్తి నారాయణరావును కాస్త బలంగా తోయడంతో నారాయణరావు వెనక్కు పడిపోయాడు.

తలకు బలంగా గాయం తగలడంతో నారాయణరావు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.పోలీసుల( Police )కు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube