శని త్రయోదశి రోజు ఈ పరిహారాలు చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ ఖాయం..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు.శని దేవుడు సూర్యభగవానుడి కుమారుడు.

ఆయనను మందగమనుడు ( Mandagamanudu ) అని కూడా పిలుస్తూ ఉంటారు.అలాగే శని దేవుడు ఒక వ్యక్తి జాతకంలో అష్టమ, అర్ధాష్టమా, ఎలినాటి శని దేవుడి ప్రభావాలను కలిగిస్తూ ఉంటాడు.

ఈ కాలన్ని దాదాపు సడే సతి అని కూడా అంటారు.దీనిలో అనేక మంచి చెడు ఫలితాలను ఇస్తుంటాడు.

ఇంకా చెప్పాలంటే శని దేవుడి( Shanidev ) అనుగ్రహం కోసం అదే విధంగా ఆయన చెడును కలిగించకుండా ఉండేందుకు పండితులు కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు.

Advertisement

ఈ పరిహారాలను పాటిస్తే మనకు ఎంతో మంచి జరుగుతుందని కూడా చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే శనివారం రోజున ప్రధానంగా నల్ల చీమలకు( Black Ants ) చక్కెర పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి.అదే విధంగా రావి చెట్టు కింద దీపం పెట్టాలి.

ముఖ్యంగా చెప్పాలంటే మన స్తోమతను బట్టి పేదవారికి వస్త్ర దానం చేయాలి.అలాగే ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామిని కొలిచిన శని దేవుడి అనుగ్రహం పొందవచ్చు.

అయితే కొంత మంది భక్తులు 5 లేదా 11 శనివారాల పాటు స్థానికంగా ఉన్న దేవాలయాలకు వెళ్తూ ఉంటారు.

అక్కడ రావి చెట్టుకు దారం చుట్టడం, చెట్టు నీడలో జపాలు,దానాలు చేస్తుంటారు.దీంతో దీని వల్ల ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని పండితులు చెబుతూ ఉంటారు.అలాగే ఎలినాటి అర్థాష్టమ ప్రభావం ఎక్కువగా ఉన్నవారు జ్యోతిష్యులను కలిసి వారు చెప్పిన విధంగా దానం చేయడం వల్ల, అలాగే నవ ధాన్యాలు దానం చేయడం వల్ల కూడా శని చెడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

కాకి తలపై తన్నితే అశుభమా? కాకి మన పై వాలితే తల స్నానం ఎందుకు చేయాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు