ఆశా వర్కర్ల కు ఉద్యోగ భద్రత కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాడ్యుటీ ఇవ్వాలి Citu జిల్లా ప్రధాన కార్యదర్శి Rksv.కుమార్ డిమాండ్

ఆరోగ్య రంగంలో విశేష సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత,రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.

కే.

ఎస్వీ.కుమార్ డిమాండ్ చేశారు.

ఈ రోజు కంచరపాలెం బియెన్నర్ ఆఫీస్ లో జరిగిన ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు.కోవిడ్ సమయంలో ఆశాలు తమ ప్రాణాలు సహితం లెక్కచేకుండా పనిచేసా రాన్నరు.

అటువంటి వారిపై నేడు వేధింపులు,పనిభారం విపరీతంగా పెరిగిందన్నారు.ఉద్యోగ భద్రత లేదన్నారు.

Advertisement

ప్రభుత్వం తరుపున ఏవిధమైన కార్మిక చట్టాలు అమలు కావడం లేదన్నారు.మార్కెట్ లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వాటి కనుగుణంగా కనీస వేతనం పెరగడం లేదన్నారు.

ఆశా లందరికీ కనీస వేతనం నెలకు 26,000/- చెల్లించాలని, పి.ఎఫ్,ఈఎస్ఐ చెల్లించాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు.వీటి సాధన కోసం ఆశాలందరూ ఐక్యంగా పోరాడాలన్నారు.

ఆశా ల న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు సీఐటీయూ నిరంతరం కృషి చేస్తుందన్నారు.సెప్టెంబర్ 20 వ తేదీన కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొరకు జరిగే కలెక్టర్ ఆఫీస్ ధర్నాలు పాల్గొనాలని కోరారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ గౌ.అధ్యక్షులు పి.మని,ఎస్ పద్మ,మేరీ, సీత, మరియు పెద్ద సంక్య లో కార్మికులు పాల్గొన్నారు.

డ్రంకెన్ డ్రైవ్ కేసు లో 10 మందికి శిక్ష
Advertisement

Latest Vizag News