ఏపీ పొలిటీషియన్స్ ను వణికించే కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ మాస్ కథలలో అద్భుతంగా నటిస్తారనే సంగతి తెలిసిందే.మాస్ సినిమాలు బాలయ్యకు బాగా సూట్ అవుతాయని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Star Hero Balakrishna Green Signal For One More Project Details Here , Star Her-TeluguStop.com

ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మరో సినిమాలో బాలయ్య నటిస్తున్నారు.ఈ సినిమాలతో పాటు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో, వశిష్ట డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్నారని తెలుస్తోంది.

అయితే ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ బాలయ్య కోసం పవర్ ఫుల్ కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.ఏపీ రాజకీయాలకు సంబంధించిన ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

బాలయ్య నుంచి ఫ్యాన్స్ కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని సమాచారం అందుతోంది.ఏపీ రాజకీయనేతలను వణికించేంత పవర్ ఫుల్ కథతో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

బాలయ్య నటించిన పలు సినిమాలకు స్టార్ రైటర్లుగా పేరును సొంతం చేసుకున్న పరుచూరి బ్రదర్స్ పని చేశారు.డైలాగ్స్ కోసమే బాలయ్య సినిమాలను చూసే ప్రేక్షకులు ఎంతోమంది ఉన్నారు.

పూర్తిగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సిద్ధమవుతున్న ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయే విధంగా ఉండనుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనే విషయం తెలియాల్సి ఉంది.

Telugu Balakrishna, Boyapati Srinu, Green Signal, Project-Movie

ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేసిన తర్వాత బాలయ్య ఈ కథలో నటించే ఛాన్స్ ఉంది.గత కొంతకాలంగా బాలయ్య ఈ జనరేషన్ ప్రేక్షకులకు సైతం నచ్చే కథలను ఎంపిక చేసుకుంటున్నారు.బాలయ్య సినిమాసినిమాకు నటన విషయంలో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందుతున్నారు.బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ ఈ ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube