అమ‌రావ‌తి సాక్షిగా అంతా ఒక్కటిగా..! బాబు.. ప‌వ‌న్.. బీజేపీ.. ఒకే వేదిక‌పైకి..!!

ఏపీలో మ‌ళ్లీ 2014 నాటి ప‌రిస్థితులు క‌ప‌డుతున్నాయా.? అధికార పార్టీకి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు ఒక్క‌తాటిపైకి వ‌స్తున్నాయా.

? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ పండితులు.జ‌గ‌న్ యాంటీ గొంతులు అన్నీ ఒక్క‌ట‌వుతుండ‌టంతో ఏపీలో మ‌రో కొత్త రాజ‌కీయం మొద‌లవుతోంద‌ని అంటున్నారు.

అమ‌రావ‌తి రాజ‌ధాని వేదిక‌గా బలమైన నాయకులు, పార్టీలు అంతా ఒక్క చోటకు చేరుతున్నారు.దీంతో అధికార వైసీపీలో టెన్ష‌న్ మొద‌లైన‌ట్లే.అయితే ఏపీలో వైసీపీ బలంగా ఉంది అని ఆ పార్టీ వారు భావిస్తున్నారు.

విపక్షాలు సైతం జగన్ బలమెంత అని తెలియకపోయినా డౌట్లు పెట్టుకోవద్దని అంతా ఒక్కటిగా ఉంటే సులువుగా ఓడిచగలమని భావిస్తున్నాయి.ఈ నేపథ్య‌లోనే కీలకమైన పార్టీలు అంతా ఒక్క తాటిపైకి రావడానికి ఒక వేదికను ఎంచుకున్నాయి.

అదే అమరావతి.అమరావతి ఏకైక‌ రాజధానిగా కోరుతూ వెంకటపాలెంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

Advertisement
As A Witness Of Amaravati, Everything Is One..! Babu.. Pawan.. BJP.. On The Same

సెప్టెంబర్ 13 నాటికి అమరావతి రాజధాని రైతుల పోరాటం మొదలెట్టి వేయి రోజులు అవుతోంది.దీంతో ఈ స‌భ‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

అమ‌రావ‌తి ఉద్య‌మ కారులు.దాంతో వెంకటపాలెంలో భారీ బహిరంగ సభను అమరావతి ఉద్యమకారులు నిర్వహిస్తున్నారు.

ఈ సభకు ఒక్క వైసీపీ మినహా అన్ని పార్టీలను ఆహ్వానించారు.టీడీపీ తరఫున చంద్రబాబు జనసేన తరఫున పవన్ కల్యాణ్, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు ఆ రోజు ఓకే వేదిక‌పై క‌నువిందు చేయ‌నున్నాయి.

అయితే చంద్రబాబు పవన్ కలసి ఒకే వేదిక మీద కనిపించడం 2019 ఎన్నికల తర్వాత ఇదే ఫ‌స్ట్ మీటింగ్ అవుతుంది.అమరావతి రాజధాని కోసం పోరాటం చేస్తున్న వారిలో టీడీపీ ముందు వరుస‌లో ఉంది.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

దానికి జనసేన తరఫున పవన్ కూడా మద్దతు ఇచ్చారు.బీజేపీ సైతం ఏకైక రాజధాని అమరావతికే జై కొడుతున్నారు.

Advertisement

ఇక వామపక్షాలు, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల నినాదం అమరావతి ఒక్క‌టే.దీంతో వైసీపీని క‌ల‌వ‌ర‌పెట్టే అంశ‌మ‌నే చెప్పాలి.

మొత్తానికి జగన్ కి యాంటీగా అంతా కలసి పూరిస్తున్న తొలి సమర శంఖారావం అని విశ్లేష‌కులు అంటున్నారు.ఇప్పటికే అమరావతి ఉద్యమకారులు అన్ని పార్టీల అధినాయకులను కలసి సభకు వచ్చేలా హామీని పొందారని అంటున్నారు.

వైసీపీ నినాదం ఏంటీ.?మరో వైపు చూస్తే మూడు రాజధానులతోనే వైసీపీ ఉంది.ఆ కల సాకారం కావడం కష్ట సాధ్యమని తెలిసినా వైసీపీకి ఇదే దారి అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ పరిస్థితుల్లో వెనక్కి వెళ్లి అమరావతికి జై కొట్టినా వైసీపీకి ఏ ప్ర‌యోజ‌నం ఉండ‌దు.పైగా విపక్షాల పోరాట‌ల‌కు ప్ర‌భుత్వం దిగివ‌చ్చింద‌ని అంటారు.దీంతో వైసీపీ మూడు రాజధానుల పాట పాడాల్సిందే త‌ప్ప‌దు మ‌రి.

దీంతో అన్ని పార్టీలు యాంటీగా ఒక్క‌ట‌వ్వ‌క త‌ప్ప‌దు.అయితే ఇక్క‌డ ఆస‌క్తిక‌ర అంశం ఏంటంటే.

ఈ సభ ద్వారా చంద్రాబు, పవన్ జనాలకు ఏం చెబుతార‌న్న‌ది పాయింట్.అలాగే బీజేపీ క‌లిసి వ‌స్తే 2014 ఎన్నికల పొత్తు రిపీట్ అవడం ఖాయమని అంటున్నారు.

ఇప్పటికే బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సానుకూలంగా వ్యవహరిస్తున్నారు.మరో వైపు వైసీపీ యాంటీ కూటమి బలంగా ఏర్పడాలని అటు పవన్ ఇటు చంద్రబాబు కోరుకుంటున్నారు.

దీంతొ అమ‌రావ‌తి సాక్షిగా అంద‌రూ ఒక్క‌తాటిపైకి వ‌చ్చి కొత్త రాజ‌కీయ నాట‌కానికి తెర లేపార‌ని అంటున్నారు.ఇక సెప్టెంబెర్ 12 న జరిగే ఈ సభ ఏపీ రాజకీయాలను ఎలాంటి మ‌లుపు తిప్పుతుందో చూడాలి మ‌రి.

తాజా వార్తలు