ప్రొ- బిఆర్ఎస్ గా మారిపోతున్న అరవింద్?

నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో బీఆరఎస్( BRS ) కు ప్రత్యామ్నాయం మేమే అని రానున్నది బిజేపి ప్రభుత్వమే అని నిన్న మొన్నటి వరకూ చెప్పుకున్న కమలనాథలు అసలు దశలో మాత్రం చేతులెత్తేస్తున్నారా లేక వ్యూహాత్మకం గా వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.ముఖ్యంగా కెసిఆర్ పేరు చెబితేనే దుమ్మెత్తి పోసే దర్మపురి అరవింద్ స్వరం లో వచ్చిన మార్పు కొత్త అనుమానాలకు ఆజ్యం పోస్తుంది .

 Arvind Becoming A Pro-brs, Arvind Dharmapuri , Cm Kcr , Brs , Bjp, Ts Politics ,-TeluguStop.com

బి ఆర్ఎస్ పరిపాలనపై మరియు కేసీఆర్ పై బిజెపి కీలక నేత ధర్మపురి అరవింద్ చేస్తున్న అనుకూల వ్యాఖ్యలు తెరవెనుక ఏదో జరుగుతుందన్న కొత్త సంకేతాలు ఇస్తున్నాయి .“ రేవంత్ తో పోలిస్తే కేసీఆర్( kcr ) బెటర్ అని, 10 సంవత్సరాల కేసీఆర్ తెలంగాణ కోసం పోట్లాడినప్పుడు రేవంత్( Revanth reddy ) తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని, కాంగ్రెస్కు ఓట్లు వేస్తే తిరిగి ఆంధ్ర పార్టీలకు పెత్తనం ఇచ్చినట్లు అవుతుందని” తెలంగాణ మొత్తాన్ని రేవంత్ అమ్మేస్తాడంటూ అరవింద్ చేసిన వాఖ్యలు బిజెపితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కొత్త చర్చలు లేవనెత్తుతున్నాయి.

Telugu Cm Kcr, Kavitha, Revanth Reddy, Ts-Telugu Political News

ముఖ్యంగా ఎన్నికల ముందే బిజెపి కాడి వదిలేసి బి ఆర్ఎస్ ( BRS )తో పొత్తు కోసం ప్రయత్నిస్తుందా? అన్న అనుమానాలు వెలువెత్తుతున్నాయి ఇప్పటికే బీఆర్ఎస్ బిజెపి లు ఒక అవగాహన మేరకు పని చేస్తున్నాయి అన్న అంచనాలు ఉన్నాయి.దానిని తెలంగాణ ప్రజలను కూడా నమ్ముతున్న వాతావరణ కనిపిస్తుంది .ఇ లాంటి దశలో కేసీఆర్ పై బహిరంగం గా అరవింద్ చేసిన వ్యాఖ్యలు అయితే తమకు వేయాలి లేకపోతే బీఆరఎస్ కు వోటు వేయాలన్నట్లుగా అరవింద్ వైఖరి ఉన్నట్టు కనిపిస్తుంది .

Telugu Cm Kcr, Kavitha, Revanth Reddy, Ts-Telugu Political News

తెలంగాణ ఎన్నికలు హాంగ్ దిశగా ప్రయాణిస్తున్నాయి అన్న ముందు చూపుతోనే అరవింద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకూ కల్వకుంట్ల కుటుంబం పేరు చెబితేనే విరుచుకుపడిన అరవింద్ లో వచ్చిన మార్పుకు కారణమమేమిటా అంటూ చర్చలు జరుగుతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube