ఆ వైఖరే బారాస కొంపముంచబోతుందా ?

తెలంగాణ ఎన్నికల ఫలితాలకు ఇంకా 24 గంటల సమయం ఉన్నా కాంగ్రెస్ విజయం( Congress party ) కన్ఫామ్ అయిపోయిందంటూ ఇప్పటికే అనేక సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ను రిలీజ్ చేసేయ్.దాంతో కాంగ్రెస్ శ్రేణులు అప్పుడే విజయోత్సవ సంబరాలకు సర్వం సిద్ధం చేశాయి.

 Arrogance Will Play Keyrole Of Brs Defeat , Brs Party , Ts Politics , Revanth-TeluguStop.com

అయితే ఎన్నికలలో బారాస హవాకు అడ్డుకట్టగా వేసిన అంశాలుగా కొంతమంది రాజకీయ పరిశీలకులు కొన్ని విశ్లేషణలు అప్పుడే మొదలుపెట్టేశారు .ముఖ్యంగా సిట్టింగ్ లపై ఉన్న వ్యతిరేకతను పట్టించుకోకుండా 90 శాతానికి పైగా తిరిగి కొనసాగించడమే అధికార బారాస పుట్టిముంచబోతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.ముఖ్యంగా భూ కబ్జాల లోను అనేక బెదిరింపు కేసులలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేల పాత్ర గురించి ప్రదాన మీడియా వార్తలలో వచ్చినా కూడా పట్టించుకోకుండా వారిని తిరిగి కొనసాగించిన కేసీఆర్( CM KCR ) ఉదాసీనతే బారాసకు పరాజయాన్ని అందించబోతుందంటూ విశ్లేషణలు వస్తున్నాయి.

Telugu Brs, Cm Kcr, Congress, Harish Rao, Job Calendar, Revanth Reddy, Ts-Telugu

అంతేకాకుండా ఫామ్ హౌస్ పరిపాలన అంటూ అధికార యంత్రంగాన్ని తన ఇంటి చుట్టూ తిప్పేలా చేసిన కేసీఆర్ అహంకార పూరిత వైఖరి తెలంగాణ ఓటర్కు అసంతృప్తి కలిగించిందని, అంతేకాకుండా ధరణి పోర్టల్ లో ఉన్న అవకతవకలపై ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న సరి చేయని వ్యవస్థ పై కోపం కూడా బారసాఓట్లకు గండి పెడుతుందని వీరు విశ్లేషిస్తున్నారు .ప్రజలకు ముఖ్య మంత్రి ని కలిసే అవకాశం లేకపోవడం కూడా నియంతృప్త విదానమని అది పలితాలపై ప్రబావం చూపిస్తుందని వీరు బావిస్తున్నారు .అంతేకాకుండా చంద్రబాబు వ్యతిరేక స్వరం వినిపించడం కూడా సీమాంధ్ర ఓటర్లలో సఖ్యా బలం ఉన్న సామాజిక వర్గానికి అసంతృప్తి కలిగించిందని అది ఎన్నికలలో గణనీయమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

Telugu Brs, Cm Kcr, Congress, Harish Rao, Job Calendar, Revanth Reddy, Ts-Telugu

ముఖ్యంగా యువత ఉద్యోగ అవకాశాలపై ఉదాసీనం గా ఉండటం , ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జాబ్ క్యాలెండర్( Job Calendar ) రిలీజ్ చేయకపోవడం జరిపిన పరీక్షలలో కూడా లీకజి ల పాలవడం వంటివి కూడా పెద్ద ఎత్తున ప్రభావం చూపించినట్లుగా తెలుస్తుంది .ఇక్కడ కాంగ్రెస్ కష్టం కంటే బారాసపై విరక్తి కాంగ్రెస్ను గెలిపిస్తుంది అని కూడా కొంతమంది రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube