బీజేపీ అగ్రనేతలు ఏపీకి రానున్నారు.ఇందులో భాగంగా ఈనెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు రానుండగా 10వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి రానున్నారు.
మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఏపీలో బీజేపీ రెండు భారీ బహిరంగ సభలకు శ్రీకారం చుట్టింది.ఈ క్రమంలోనే విశాఖ, తిరుపతిలో బీజేపీ సభలు జరగనున్నాయి.
అయితే ఈ సభల వేదికగా ఏపీలో పొత్తులపై ప్రకటన చేస్తారా.? లేదా.? అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.