ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు మరికొందరు టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పార్టీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం చెలరేగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.అనంతరం టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు గోపాలపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.







