మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఏర్పాట్లు జోరందుకున్నాయి.దీనిలో భాగంగా పోలింగ్ సామాగ్రిని ఇవాళ అధికారులు పంపిణీ చేయనున్నారు.
సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోనున్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా 298 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
అదేవిధంగా మునుగోడులో మొత్తం 105 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయగా, మొత్తం 2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.కాగా ఈ ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు ఉన్నారు.
బైపోల్ విధుల్లో 1192 మంది సిబ్బంది పాల్గొననున్నారు.ఇప్పటికే రెండుసార్లు పోలింగ్ సిబ్బందికి అధికారులు శిక్షణ ఇచ్చారు.
అటు భద్రతా విధుల్లో సుమారు ఐదు వేల మంది పోలీసులు పాల్గొనున్నారు.రేపు పోలింగ్ జరగనుండగా.
ఆదివారం ఫలితాలు వెల్లడికానున్నాయి.ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







