క్రిస్మస్ సందర్భంగా ఫ్లోరిడాలో( Florida ) దారుణ ఘటన చోటుచేసుకుంది.క్రిస్మస్ కానుకల( Christmas presents ) విషయంలో గొడవపడి 14 ఏళ్ల బాలుడు తన 22 ఏళ్ల సోదరిని కాల్చి చంపాడు.
అదృష్టవశాత్తూ ఆమె బిడ్డ ఈ కాల్పుల నుంచి ప్రాణాలతో బయటపడింది.అతని 15 ఏళ్ల సోదరుడు మాత్రం ఆత్మరక్షణ కోసం ఈ 14 ఏళ్ల బాలుడిని పొట్టలో కాల్చి పారిపోయాడు.
ఆ రోజు ముందుగానే క్రిస్మస్ బహుమతుల కోసం కుటుంబం షాపింగ్‌కి వెళ్లింది.ఎవరికి ఎక్కువ బహుమతులు ఇస్తున్నారు, వారికి ఎంత డబ్బు ఖర్చవుతుందనే విషయంపై సోదరులిద్దరూ వాగ్వాదానికి దిగారు.
పోలీసుల అభిప్రాయం ప్రకారం, వీరి గొడవ మొదట చాలా క్యాజువల్ గా జరిగింది.అయితే, లార్గోలోని అమ్మమ్మ ఇంటికి చేరుకున్న తర్వాత కూడా ఈ బ్రదర్స్ గొడవ ఆపలేదు.
అమ్మమ్మ ఇంట్లో 14 ఏళ్ల బాలుడు సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్‌ని( semi-automatic handgun ) తీసి తన అన్నయ్య వైపు చూపించాడు.తలపై కాల్చి చంపేస్తానని హెచ్చరించాడు.అన్నయ్య తనకు గొడవ పడటం ఇష్టం లేదని, ఇంట్లో నుంచి వెళ్లిపోమని చెప్పాడు.11 నెలల చిన్నారితో పాటు అక్కడే ఉన్న వారి సోదరి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసింది.ఇది క్రిస్మస్!, గొడవ పడకుండా ఉంటారా అని ఆమె వీరిని కోరింది.14 ఏళ్ల బాలుడు ఆమె మాట వినలేదు.అతను ఆమెను బూతులు తిట్టాడు.ఆమెను, ఆమె బిడ్డను కాల్చివేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.అనంతరం మధ్యాహ్నం 1:45 గంటల ప్రాంతంలో ఆమె ఛాతీపై కాల్చాడు.క్యారియర్‌లో( carrier ) ఉన్న పాపకు మాత్రం బుల్లెట్ తగలలేదు.
ఈ బాలుడి అన్నయ్య ఆత్మరక్షణలో భాగంగా మరో తుపాకీ పట్టుకుని 14 ఏళ్ల బాలుడి కడుపులో కాల్చేశాడు.అనంతరం తుపాకీని సమీపంలోని యార్డ్‌లో విసిరి పారిపోయాడు.అనంతరం బంధువుల ఇంట్లో పోలీసులకు దొరికిపోయాడు.
సోదరిని ఆసుపత్రికి తరలించగా, ఆమె మరణించింది.బుల్లెట్ ఆమె ఎడమ చేయి గుండా ఛాతీలోకి వెళ్లి రెండు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు.ఆమెకు అంతర్గతంగా రక్తం కారడంతో ఊపిరి పీల్చుకోలేకపోయింది.14 ఏళ్ల బాలుడు తుపాకీ గాయం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు అతడికి సర్జరీ చేశారు.అతడికి ఇప్పుడు ఎలాంటి ప్రాణా హాని లేదు కానీ ఫస్ట్-డిగ్రీ హత్య, పిల్లల దుర్వినియోగం, మైనర్‌గా తుపాకీ కలిగి ఉండటం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి అభియోగాలు అతనిపై ఉన్నాయి.
ఈ బాలుడిని మానసిక ఆరోగ్య కేంద్రానికి కూడా పంపినట్లు పోలీసులు తెలిపారు.యువకులు తుపాకులు పట్టుకుని హింసాత్మకంగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుందో ఇదో ఉదాహరణ అని పోలీసులు తెలిపారు.అన్నదమ్ములిద్దరూ గతంలో కార్లు దొంగిలించిన కేసులో అరెస్టులు అయ్యారని వారు తెలిపారు.14 ఏళ్ల బాలుడిని పెద్దవాడిగా విచారించాలా వద్దా అని ప్రాసిక్యూటర్ కార్యాలయం నిర్ణయిస్తుందని కూడా వారు చెప్పారు.