తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్( BRS ) ఎన్నికల ప్రచారం ఉదృతం చేసింది.ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తి అయిన నేపథ్యంలో, ఎన్నికల సమర శంకం పూరించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాలు , నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేపట్టేందుకు షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటికే అనేక బహిరంగ సభలు నిర్వహించారు.
బీఆర్ఎస్ బీఫామ్ పొందిన అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. పార్టీ అగ్ర నేతల పర్యటనలు తమ నియోజకవర్గంలో ఉండే విధంగా చూసుకుంటున్నారు.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ , కెసిఆర్ కుమార్తె కవిత మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండేలా కనిపిస్తున్నారు.దీనికి కారణం ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scan ) వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కోవడమే కారణం .

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా కవిత ఎన్నికల ( Kavitha )ప్రచారం నిర్వహించారు .ఎన్నికల ప్రచారానికి పంపించాల్సిందిగా కెసిఆర్ పై బీఆర్ఎస్ అభ్యర్థులు ఒత్తిడి చేసేవారు. కవిత ను ప్రచారానికి ఒప్పించేందుకు ఆమె ఇంటి వద్ద క్యూ కట్టేవారు. పదునైన వ్యాఖ్యలతో ఆమె చేసే ప్రసంగాలు, మహిళలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం ఇవన్నీ హైలెట్ అయ్యేవి.

అయితే ఇప్పుడు కవితతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే అది తమకు ఇబ్బందికరంగా మారుతుందని, లిక్కర్ స్కామ్ లో కవిత( Kavitha ) తీవ్ర ఆరోపణలు ఉండడంతో ఆ ప్రభావం కచ్చితంగా తమపై పడుతుందనే భయం బీఆర్ఎస్ అభ్యర్థుల్లో నెలకొందట .ఇక ఇదే విషయంలో బిఆర్ఎస్ అధిష్టానం కూడా ఇదేవిధంగా ఆలోచిస్తుందట. కవితను నిజామాబాద్ జిల్లాకు పరిమితం చేయాలని , రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు దింపితే ప్రతిపక్షాలు కవిత లిక్కర్ స్కాం వ్యవహారంపై బీ ఆర్ ఎస్ ను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని భావిస్తుందట.అందుకే నిజామాబాద్ జిల్లా( Nizamabad District ) రాజకీయాలకే కవితను పరిమితం చేయాలని బీ ఆర్ ఎస్ అధిష్టానం నిర్ణయించుకుందట.