అక్కడి జొన్న రొట్టెలు తింటున్నారా.. అయితే ఆరోగ్యం పై చెడు ప్రభావం పడినట్లే..!

ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం చాలా రకాల అడ్డమైన పనులను కొందరు వ్యాపారులు చేస్తున్నారు.సరుకులను కల్తీ చేయడంతో వినియోగదారుల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు.

నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలను బలోపేతం చేయడంలో అధికారులు విఫలం అవుతున్నారు.కల్తీ నియంత్రణకు ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

న్యాయస్థానాలు స్వయంగా కేసుల్ని స్వీకరించి కల్తీ వస్తువులను విక్రయించే వారిపై దాడులు జరపాలని చాలామంది ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇలాంటి పరిస్థితులలో వినియోగదారులు కూడా కల్తీ ఆహార వస్తువులేవో అసలు వస్తువులు ఏవో తెలుసుకోవడం అవసరం.

ఆహార పరిరక్షణ నాణ్యత ప్రమాణాల సంస్థ, టెక్నాలజీలో వచ్చిన మార్పుల వల్ల ఎన్నో ఆహారపదార్థాలను మనం పక్కన పెట్టేసాం.కానీ పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనలోని ఆరోగ్య సమస్యలు( Health problems ) కూడా పెరుగుతూ వస్తున్నాయి.

Advertisement

అందుకే మళ్ళీ పాత పద్ధతుల్లోనే కొన్ని ఆహార పదార్థాలను తయారు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చాలామంది ప్రజలు చేస్తున్నారు.

అందులో ముఖ్యమైన ఆహార పదార్థం జొన్న రొట్టె( Jonna Rotte ).ఇప్పుడు ఈ జొన్న రొట్టె వ్యాపారం కూడా మార్కెట్లో కల్తీగా మారిపోయింది.మహబూబ్ నగర్ జిల్లా పట్టణంలో కొన్నేళ్లుగా జొన్న రొట్టెల వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఇప్పుడు వ్యాపారం పెరగడంతో ఇది తయారు చేసే వారు అడ్డదారులు తొక్కుతున్నారు.జొన్న రొట్టెలను ఎక్కువగా కల్తీ చేస్తుండడంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు.

జొన్న పిండిలో అత్యధిక శాతం రేషన్ బియ్యం ఉపయోగిస్తున్నారు.రొట్టె రంగు రావడానికి పసుపు రంగు వచ్చేట్టు కెమికల్ పౌడర్( Chemical powder ) కలుపుతున్నారు.ఈ విషపు పౌడర్లు తినడం వల్ల అజీర్తి అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ రొట్టె ఎంతో మంచిదని, అరుగుదలకు,ఉబగాయం ఉన్నవాళ్ళకు ఉపయోగపడుతుందని నమ్మకంతో వీటిని చాలా మంది ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.అవి ఎలా కల్తీ అవుతున్నాయో పరిశీలిస్తే తెలుస్తుంది.

Advertisement

ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలను తినడం వల్ల చర్మం, జుట్టు, గుండె, ఎముకల ఆరోగ్యం పై కూడా ఎంతో చెడు ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

తాజా వార్తలు