వర్షాకాలంలో కాలీఫ్లవర్ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

కాలీఫ్లవర్( Cauliflower) పోషకాల ఖజానా అని దాదాపు చాలా మందికి తెలియదు.దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

కాలీఫ్లవర్ క్యాన్సర్ నుంచి ఎముకలను బలంగా ఉంచడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.కాలీఫ్లవర్ క్రూసిఫరస్ కూరగాయల కుటుంబానికి చెందినది.

ఈ కూరగాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.కాలీఫ్లవర్ తెలుపు, ఆకుపచ్చ వంటి ఎన్నోరంగుల్లో లభిస్తుంది.

ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది.అలాగే ఈ కూరగాయలు ఫోలిక్ యాసిడ్, విటమిన్ b6, విటమిన్ బి5, ఫైబర్, క్యాల్షియం, పుష్కలంగా ఉంటాయి.

Advertisement

ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని చాలావరకు నియంత్రిస్తుంది.ఒక కప్పు కాలీఫ్లవర్ లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది.

అలాగే కేలరీలు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే కాలీఫ్లవర్ శరీర కొవ్వును తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ కూరగాయను డైట్ చేర్చుకోవడం ఎంతో మంచిది.

ఈ కూరగాయ మధుమేహానికి కూడా ఎంతో బాగా పనిచేస్తుంది.ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

ఫైబర్ పుష్కలంగా ఉండే కాలీఫ్లవర్ జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.ఇది మలబద్ధకం నుంచి బయటపడడానికి గట్ ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.కాలిఫ్లవర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?

కాలిఫ్లవర్ లో సల్ఫోరాఫేన్ అనే పిలువబడే మొక్కల సమ్మేళనం ఉండడం వల్ల ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఇది యాంటీ ఆక్సిడెంట్లు( Antioxidants) ఎక్కువగా ఉండే కూరగాయ.

Advertisement

కాలీఫ్లవర్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది.

కాలీఫ్లవర్ లో మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి.ఈ కూరగాయ జ్ఞాపకశక్తి, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం.కాబట్టి మెదడు ఆరోగ్యం ( Brain Health )కోసం వీటిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో మంచిది.

ఆరోగ్యానికి మంచిదని ఏ ఆహారమైన అతిగా తినడం అస్సలు మంచిది కాదు.

తాజా వార్తలు