కే‌సి‌ఆర్ పై దండయాత్రకు.. ఆ ముగ్గురు సిద్దమయ్యారా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినది మొదలుకొని జరిగిన రెండు ఎలక్షన్స్ లో బి‌ఆర్‌ఎస్( BRS ) ( టి‌ఆర్‌ఎస్ ) తిరుగులేని విజయం సాధించిన సంగతి తెలిసిందే.2014 నుంచి ఇప్పటివరకు కే‌సి‌ఆర్( KCR ) ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నా చర్చ.వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయం అని బి‌ఆర్‌ఎస్ కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికి, ఎక్కడో కాస్త ఆత్మవిశ్వాసం లోపించినట్లే కనిపిస్తోంది.

 Are Those Three Ready To Invade Kcr , Kcr, Ys Sharmila, Bjp Chief Bandi Sanjay,-TeluguStop.com

ఎందుకంటే ప్రస్తుతం కే‌సి‌ఆర్ సర్కార్ పై అక్కడక్కడ వ్యతిరేక స్వరం వినిపిస్తోంది.

Telugu Bandi Sanjay, Revanth Reddy, Ys Sharmila-Politics

ఇదే సమయంలో బిజెపి( BJP ) రాష్ట్రంలో బలం పెంచుకుంటోంది.దాంతో వచ్చే ఎన్నికల్లో టాఫ్ ఫైట్ జరిగే అవకాశం లేకపోలేదు.అయితే తన వ్యూహాలతో అప్పటికప్పుడు రాజకీయ మార్చేయగల సత్తా ఉన్న కే‌సి‌ఆర్ ను ఎన్నికల్లో ఓడించడం అంత తేలికైన విషయం కాదు.

అందుకే వచ్చే ఎన్నికల్లో కే‌సి‌ఆర్ ను గద్దె దించేందుకు విపక్షాలు సరికొత్త వ్యూహాలను పన్నుతున్నట్లు తెలుస్తోంది.కే‌సి‌ఆర్ ను గద్దె దించాలంటే విపక్షాల ఐక్యతే ముఖ్యమని భావిస్తున్నారట కొంత మంది నేతలు.

అందులో భాగంగానే కే‌సి‌ఆర్ కు వ్యతిరేకంగా విపక్షలను ఏకం చేసే పనిలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైస్ షర్మిల( Y.S Sharmila ) పావులు కడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.మొదటి నుంచి తాము ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తామని చెబుతున్నా షర్మిల ఇప్పుడు కూటమి వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

Telugu Bandi Sanjay, Revanth Reddy, Ys Sharmila-Politics

ఇటీవల వైఎస్ షర్మిల( YS Sharmila ) విపక్షాల ఐక్యత కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మరియు బీజేపీ చీఫ్ బండి సంజయ్( BJP chief Bandi Sanjay ) కి పోన్ చేసినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.ఒకవేళ తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు అయితే అది సంచలనాలకు తెరలేచే అవకాశం ఉంది.ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బద్ద శత్రు పార్టీలుగా ఉన్నాయి.

అలాగే షర్మిల కూడా అటు బీజేపీపైన, ఇటు కాంగ్రెస్ పైన ఘాటు విమర్శలు చేసిన సందర్బలు కూడా ఎక్కువే.ఈ నేపథ్యంలో మూడు బిన్న పార్టీలు కలిసి నడిచేందుకు ఎంతవరకు అవకాశం ఉందనేది ప్రశ్నార్థకమే.

అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం గనుక.కే‌సి‌ఆర్ ను గద్దె దించేందుకు మూడు పార్టీలు కలిసిన ఆశ్చర్యం లేదనేది మరికొందరి వాదన.

మరి ఏం జరుగుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube