వీరే లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో రెడీ ?

ఏపీలో ఎన్నికలను ఎదుర్కొనేందుకు టిడిపి( TDP ) సిద్ధం అయిపోతుంది.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో జనాలకు దగ్గర కావడంతో అంతకంటే ఎక్కువ స్థాయిలో సంక్షేమ పథకాలను తమ మేనిఫెస్టోలో ప్రకటించి రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, 2024 లో అధికారంలోకి వస్తామని నమ్మకం టిడిపి అధినేతలో స్పష్టంగా కనిపిస్తోంది.అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు మేనిఫెస్టోను పగడ్బండిగా రూప కల్పన చేస్తుంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఈ మేనిఫెస్టో కీలకంగా మారుపోతుండడంతో , దీనిపై అంతే స్థాయిలో ఫోకస్ పెట్టింది.

Are They The Target Of The Tdp Manifesto , Tdp, Chandrababu, Jagan, Ysrcp,ap,

ఈ సంవత్సరం విజయదశమి పండుగ రోజున టిడిపి మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు కసరత్తు జరుగుతుంది.పేదల సంక్షేమం ,రైతులు, యువత లక్ష్యంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అనేక లోటు పాట్లు ఉండడం,  వీటిపై ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అటువంటి పొరపాట్లు జరగకుండా పగడ్బందీగా టిడిపి మేనిఫెస్టోను తయారు చేస్తుంది.

Advertisement
Are They The Target Of The TDP Manifesto? , TDP, Chandrababu, Jagan, YSRCP,ap,

ప్రస్తుతం తయారవుతున్న టిడిపి మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలే ప్రధాన అజెండాగా ఉండబోతున్నాయి. రైతులు( Farmers ) , యువత,  మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను తయారు చేస్తున్నారట.

అలాగే రాష్ట్రంలోని పేదల పరిస్థితి మెరుగయ్యేందుకు ఆర్థిక స్వలంబన లభించే విధంగా స్కీముల ప్రకటన చేయబోతున్నారట.మహిళలకు ఈ మేనిఫెస్టోలో పెద్దపీట వేసి వారి ఓట్లని గంప గుత్తగా టిడిపికి పడేవిధంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు.

Are They The Target Of The Tdp Manifesto , Tdp, Chandrababu, Jagan, Ysrcp,ap,

దీంతోపాటు సామాజిక భద్రత పెన్షన్లు , వికలాంగుల పించన్ లో భారీగా మార్పులు చేయడం తో పాటు , అన్ని విషయాల్లోనూ పకడ్బందీగ జాగ్రత్తలు తీసుకుంటూ,  కొత్త మేనిఫెస్టోను నిపుణులతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది .2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ప్రకటించిన నవరత్నాలు( Navaratnalu Scheme ) మేనిఫెస్టో ప్రధాన పాత్ర వహించిందనే విషయాన్ని గ్రహించిన టిడిపి అధినేత చంద్రబాబు అంతకంటే ఎక్కువ స్థాయిలో టిడిపి మేనిఫెస్టోను తయారు చేయించి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు పగడ్బందీగా వ్యూహాలు రచిస్తున్నారట.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు