ప్రభాస్ కి అసలైన పోటీ ఇచ్చే స్టార్ హీరోలు వీళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్( Prabhas ) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఎప్పుడైతే ఆయన ఒక సినిమాను చేయడానికి సిద్ధమవుతాడో అప్పటినుంచి ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

బాహుబలి( Baahubali ) సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో విపరీతమైన అంచనాలను పెంచడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ స్టైల్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.

అయితే ప్రభాస్ కు ఇప్పుడు పోటీ ఇచ్చే హీరోలు ఎవరు అనే దానిమీద పాన్ ఇండియాలో తీవ్రమైన చర్చలైతే జరుగుతున్నాయి.ఇక ప్రభాస్ ని డీ కొట్టే హీరోలు ఇప్పుడప్పుడే ఎవరూ కనిపించడం లేదు.

పుష్ప 2( Pushpa 2 ) సినిమాతో అల్లు అర్జున్( Allu Arjun ) ఒక్కసారిగా పాన్ ఇండియాలో భారీ ప్రభంజనాన్ని సృష్టించినప్పటికి ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డును మాత్రం టచ్ చేసే అవకాశం లేదంటూ కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Advertisement

రాజమౌళి తో( Rajamouli ) మహేష్ బాబు( Mahesh Babu ) పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.కాబట్టి ప్రభాస్ ను ఢీకొట్టే అవకాశం మహేష్ బాబు ఒక్కడికే ఉందంటూ మరి కొంతమంది సినిమా మేధావులు అభిప్రాయపడుతున్నారు.ఇక ఏది ఏమైనా కూడా మరో కొన్ని సంవత్సరాల వరకు ప్రభాస్ ను ఢీ కొట్టే హీరో మరొకరు లేరనేది వాస్తవం.

ఇక ఇప్పుడు చేస్తున్న వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తే మాత్రం ప్రభాస్ స్టార్ డమ్ మరింత పెరగడమే కాకుండా రెమ్యూనరేషన్ ని కూడా భారీ రేంజ్ లో తీసుకుంటున్న హీరోగా గుర్తింపును సంపాదించుకుంటాడు.మరి తను అనుకున్నట్టుగానే సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ని సాధించాలి అంటే అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని శాశించాలి అంటే మరో మూడు నాలుగు సక్సెస్ లతో తన సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది.మరి ప్రభాస్ ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకుంటాడా లేదా అనేది తెలియాల్సిన అవసరమైతే ఉంది.

ఇక వరుసగా సలార్, కల్కి లాంటి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ప్రభాస్ మరోసారి ఇండస్ట్రీ మీద తన పంజా దెబ్బను రుచి చూపించడానికి రెడీ అవుతున్నాడనే చెప్పాలి.ఇక 2025 సంవత్సరంలో ఆయన దాదాపు రెండు సినిమాలను రిలీజ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి.

మంచు వారింట మొదలైన చక్కెర లొల్లి... చంపడానికే కుట్ర... మనోజ్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు