ఏదో ఒకరకంగా టీడీపీ( TDP ) జనసేన పార్టీల తో పొత్తు కు బీజేపీ అగ్ర నేతలను ఒప్పించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) చేయని ప్రయత్నం లేదు.గతంలో ఒకసారి ఈ పొత్తుల విషయమై చర్చించేందుకు ఢిల్లీ కి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో ప్రత్యేకంగా భేటీ అయ్యి పొత్తుల విషయమై చర్చించినా… బీజేపీ కేంద్ర పెద్దలు ఇప్పటి వరకు ఈ విషయమై క్లారిటీ ఇవ్వలేదు.
బీజేపీ నిర్ణయం ఏంటో తెలియక టీడీపీ పూర్తి స్థాయిలో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ప్రకటించలేకపోతోంది.మరో వైపు చూస్తే ఎన్నికలకు సమయం దగ్గర పడింది.

ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ( YCP ) ఎనిమిది విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.దీంతో బిజెపితో పొత్తు విషయంలో ఏదో ఒకటి తేల్చుకునేందుకు ఈరోజు టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి కేంద్ర బిజెపి పెద్దలతో చర్చించి, ఏదో రకంగా పొత్తు పెట్టుకునేందుకు బిజెపి అగ్ర నేతలతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు.పొత్తులో భాగంగా బిజెపి కి 9 నుంచి 10 లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు.బీజేపీ కి టీడీపీ కేటాయించబోయే సీట్లు, అభ్యర్థుల పేర్లు ఇవేనంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వైజాగ్ జీవీఎల్ నరసింహారావు( GVL Narasimha Rao ), అరకు కొత్తపల్లి గీత, ఏలూరు సీఎం రమేష్, రాజమండ్రి పురందరేశ్వరి /సోమ వీర్రాజు , నరసాపురం – ఇంకా అభ్యర్దిని డిసైడ్ చేయలేదు.రాజంపేట కిరణ్ కుమార్ రెడ్డి, హిందూపురం – విష్ణువర్ధన్ రెడ్డి /సత్య కుమార్/ పరిపూర్ణానంద, విజయవాడ – సుజనా చౌదరి, తిరుపతి ఐఏఎస్ రత్న ప్రభ లేదా ఆమె కుమార్తె ఈ సీట్లు, అభ్యర్థుల పేర్లే ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చాయి.పొత్తు పై ఒక క్లారిటీ వచ్చిన తరువాత ఈ జాబితాను, నియోజక వర్గాల జాబితాను ఫైనల్ చేసే అవకాశం ఉందట.