టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా మంచి గుర్తింపు పొందిన వారిలో యంగ్ డైరెక్టర్ కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబీ ఒకరు.
ఈయన రవితేజ హీరోగా నటించిన పవర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యారు అనంతరం పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ వెంకటేష్ నాగచైతన్య వెంకీ మామ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.తాజాగా బాబి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య సినిమాకు దర్శకత్వం వహించారు.
ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే డైరెక్టర్ బాబి వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.అయితే తాజాగా బాబి సినీ కెరియర్ గురించి కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ముఖ్యంగా ఈయన లవ్ స్టోరీ గురించి తెలియడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈయన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు.అయితే ఈయన లవ్ స్టోరీ లో ట్విస్టులు కనుక తెలిస్తే ఏకంగా ఒక సినిమా స్టోరీని రాయవచ్చు.

డైరెక్టర్ బాబి కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఈయన భార్య అనూష మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి.వీరిద్దరి కామన్ ఫ్రెండ్స్ ప్రేమలో ఉండగా వారి ప్రేమకు వీరిద్దరూ సహాయం చేస్తూ వీరు కూడా ప్రేమలో పడ్డారు.అయితే వీరి స్నేహితుల లవ్ ఫెయిల్యూర్ అయినప్పటికీ వీరి లవ్ మాత్రం సక్సెస్ అయింది.ఇక అనూష తండ్రి ప్రభుత్వ శాఖలో ఉన్నత ఉద్యోగిగా పని చేస్తున్నారు.
ఇక అనూష సోదరి స్వయానా చెస్ ఛాంపియన్ ద్రోణవల్లి నిహారిక కావడం విశేషం.ఇలా ద్రోణవల్లి నిహారిక స్వయాన బాబీకి మరదలు వరుస అవుతుందని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.







