ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు.2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాకపోతే పార్టీ తీవ్ర ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవడంతో పాటు, పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందనే భయం బాబులో ఎక్కువగా ఉంది.అందుకే వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఆయన రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.2019 ఎన్నికల్లో మొదటిసారిగా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడంతో ఎప్పుడూ లేని విధంగా కేవలం 23 స్థానాలు మాత్రమే టిడిపికి దక్కాయి.మళ్ళీ అదే పరిస్థితి తలెత్తకుండా బలమైన పార్టీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికలను ఎదుర్కోవాలని చూస్తున్నారు.ఈ క్రమంలోనే జనసేన బిజెపి వంటి పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మూడు పార్టీలు కలిస్తే 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో బాబు ఉన్నారు.
టిడిపి విషయంలో జనసేన సానుకూలంగా ఉన్నా, ఎన్నికల సమయం నాటికి గాని ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశం కనిపించడం లేదు.
ఇక టిడిపితో పొత్తు విషయమై ఏపీ బీజేపీ నేతలు ఏమాత్రం ఇష్టపడడం లేదు.అలాగే కేంద్ర బీజేపీ పెద్దలు ఇదే వైఖరితో ఉంటూ వచ్చారు.
గతంలో టిడిపి తో పొత్తు ఉన్న సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆ పార్టీ అగ్ర నేతలు ఎవరు మర్చిపోలేదు.అయితే ఏపీలో బిజెపి ప్రభావం పెరిగేలా చేసుకోవాలంటే ఖచ్చితంగా పొత్తు ఉండాల్సిందే నన్న అభిప్రాయంతో బిజెపి పెద్దలు ఉన్నారట.
ఈ క్రమంలోనే టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చంద్రబాబును కూడా రావలసిందిగా ఆహ్వానించారు.

ఆ సందర్భంగా జరిగిన సంభాషణల మధ్య టీడీపీతో పొత్తు వ్యవహారం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.టిడిపితో పొత్తు విషయంలో కేంద్రం బిజెపి పెద్దలు సానుకూలంగా ఉన్నట్లుగా కిషన్ రెడ్డి బాబుకు చెప్పారట.ఈ మేరకు త్వరలోనే హైదరాబాదులో కేంద్ర బీజేపీ పెద్దలు కొంతమంది చంద్రబాబుతో సమావేశమై పొత్తు అంశంపై ఒక క్లారిటీకి రాబోతున్నట్లుగా కిషన్ రెడ్డి చెప్పారనే విషయం ఇప్పుడే బయటకు వచ్చింది.
కేంద్ర అధికార పార్టీగా ఉన్న బిజెపి మద్దతు తమకు ఉంటే వైసిపి దూకుడుకు బ్రేకులు పడతాయని తమ విజయానికి డొకా ఉండదనే ధీమాలో చంద్రబాబు ఉన్నారట.ఈ మేరకు బిజెపితో పొత్తు విషయంలో ఆ పార్టీ విధించే షరతులకు కూడా అంగీకారం తెలపాలనే ఆలోచనలో బాబు ఉన్నారట.







