బ్యాచిలర్ లైఫ్‌లు ఇలా ఉంటాయా..? అర్థరాత్రి 12 గంటల తర్వాత ఏం చేస్తున్నారంటే..?

ఉద్యోగం కోసం లేదా కోచింగ్ కోసం యువకులు తమ సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి సిటీలకు వెళుతూ ఉంటారు.ఉద్యోగం సంపాదించి సిటీలలోనే స్థిరపడిపోతారు.

అయితే సిటీలకు వెళ్లినప్పుడు కొంతమంది హాస్టళ్లల్లో, మరికొంతమంది స్నేహితులతో కలిసి రూమ్‌ను అద్దెకు తీసుకుని ఉంటూ ఉంటారు.ఇలాంటి సమయంలో రూమ్‌లోనే వంట చేసుకుంటూ ఉంటారు.

స్నేహితులందరూ కలిసి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ వంట వండుకుంటారు.ఫ్రెండ్స్ తో కలిసి అలా తమ బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.ఇందులో ఒక బ్యాచిలర్ యువకుడు వంట చేస్తున్న విధానం చూస్తే ఎంతగా ఎంజాయ్ చేస్తున్నాడో అర్థమవుతుంది.అర్థరాత్రి 12 గంటలకు పాటలు వింటూ నూడుల్స్ చేస్తున్నాడు.

Advertisement

పాటలు పెట్టుకుని ఊగిపోతూ, డ్యాన్స్ వేస్తూ నూడుల్స్ లో మసాలాలు కలిపేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.ఇలా డ్యాన్స్ వేస్తూ అర్థరాత్రి మ్యాగీ( Maggie ) చేస్తూ బ్యాచిలర్ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.

అతడు డ్యాన్స్ చేస్తూ మ్యాగీ చేస్తుండగా రూంలోని స్నేహితుడు తన ఫోన్ లో రికార్డు చేయడం ప్రారంభించాడు.దీనిని గమనించి యువకుడు మరింతగా రెచ్చిపోయి డ్యాన్స్ వేశాడు.

బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్ ( Shah Rukh Khan )నటించిన ఓ శాంతి ఓం సినిమాలోని దర్దే డిస్కో పాటకు ఊగిపోయి డ్యాన్స్ చేస్తున్నాడు.ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.ఈ వీడియో చూస్తే తమ బ్యాచిలర్ లైఫ్ గుర్తుకొస్తుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

బ్యాచిలర్ బాయ్స్ ఉండే రూముల్లో అర్థరాత్రి ఇలాంటివే కనిపిస్తాయంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.బ్యాచిలర్ లైఫ్ అంటే ఇలా ఉంటుందని, అర్థరాత్రి 12 గంటలు దాటినా నూడుల్స్ చేసుకుని తినాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మొత్తానికి ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో చూడగానే చాలామందికి తమ బ్యాచిలర్ లైఫ్ గుర్తుకు రాకుండా ఉండదు.

Advertisement

తాజా వార్తలు