స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన ఏఆర్ రెహమాన్ గొప్పదనం గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎంతోమంది నేటితరం మ్యూజిక్ డైరెక్టర్లకు ఏఆర్ రెహమాన్ స్పూర్తి అనే సంగతి తెలిసిందే.
తెలుగులో కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేయడం జరిగింది.ఏఆర్ రెహమాన్ సంగీతానికి ఎన్నో పురస్కారాలు లభించడం గమనార్హం.
అయితే ఏఆర్ రెహమాన్ తండ్రి శేఖర్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనే విషయం చాలా తక్కువమందికి తెలుసు.శేఖర్ కొడుకు ఏఆర్ రెహమాన్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండగా ఆయన కూతురు ఇశ్రత్ క్రాతి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.
ఒకవైపు సినిమాలకు మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్ లకు మ్యూజిక్ అందించడం ద్వారా ఇశ్రత్ క్రాతీ వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా ఒక కవి వందే మాతరం ఆల్బమ్ ను తనదైన శైలిలో రూపొందించగా ఇశ్రత్ కాత్రి ఈ పాటను పాడటంతో పాటు ఈ పాటలో నటించి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు.ఈ విషయం తెలిసిన నెటిజన్లు పులి కడుపున పులే పడుతుందని శేఖర్ కుటుంబం విషయంలో ఇదే నిజమైందని చెబుతున్నారు.ఈ నెల 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సాంగ్ రిలీజ్ కానుంది.

ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన మాదేశ్ ఈ సాంగ్ కు దర్శకత్వం వహించారు. ఇశ్రత్ కాత్రి ఈ సాంగ్ గురించి మాట్లాడుతూ ఇలాంటి ఆల్బమ్ లను దేశానికి అందించడం కృతజ్ఞతతో కూడిన బాధ్యత అని వెల్లడించారు.ఇశ్రత్ కాత్రి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.







