తెలంగాణలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ నియామకం అయ్యారు.ఈ మేరకు డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆంజనేయ గౌడ్ అందుకున్నారు.ఈ క్రమంలో సీఎం కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2016లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా బాధ్యతలను నిర్వహించారు.







