ఆపిల్ ఐఫోన్ యూజర్లకు ఇది మంచి శుభవార్తనే చెప్పుకోవాలి.అవును, మీరు విన్నది నిజమే.
ఇకనుండి ఐఫోన్ వినియోగదారులు తమ ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్ మధ్య కనెక్టివిటీని చాలా తేలికగా కొనసాగించవచ్చు.ఇందుకోసం ఖరీదైన మాక్ ని ఇక కొనాల్సిన అవసరం లేదు.
కొత్త విండోస్ అప్‌డేట్‌లో భాగంగా ఐఫోన్ యూజర్లు పీసీ నుండి నేరుగా ఫోన్ కాల్స్, మెసేజ్‌లను స్వీకరించవచ్చు అలాగే పంపవచ్చు.అంతేకాకుండా నోటిఫికేషన్‌లను కూడా పొందవచ్చు.
అదెలాగంటే మైక్రోసాఫ్ట్ అప్‌డేట్ చేసిన ఫోన్ లింక్ డెస్క్‌టాప్ యాప్ ద్వారా ఐఫోన్, విండోస్ పీసీలను లింక్ చేయడం ద్వారా పొందవచ్చన్నమాట.
ఇకపోతే ఇప్పటివరకు, ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌ను ల్యాప్‌టాప్‌కు సింకరైజ్ చేసేందుకు మాత్రమే అనుమతి ఉండేదని మీకు తెలిసినదే.ప్రస్తుతం, బీటా ఛానెల్ ప్రోగ్రామ్‌లోని యూజర్లు మాత్రమే ఫీచర్ టెస్టింగ్ చేసుకొనే వీలుంది.ఐఫోన్‌ను మీరు తీసుకున్న తర్వాత యూజర్లు బ్లూటూత్ ద్వారా కనెక్షన్‌ని ఏర్పాటు చేసుకోవాలి.
ఈ తర్వాత యూజర్లు క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయమని ప్రాంప్ట్ కనిపిస్తుంది.ఆ ప్రక్రియ చేశాక మైక్రోసాఫ్ట్ మీ ఐఫోన్ నుంచి ఫోన్ లింక్‌లో నోటిఫికేషన్‌లు, కాంటాక్టులను సరిగ్గా చూపించడానికి ఫస్ట్ స్టెప్ పూర్తయిందని అర్ధం చేసుకోవాలి.
ఫోన్ లింక్ యాప్ కాల్‌లు, మెసేజ్‌లు కాంటాక్టుల కోసం ప్రైమరీ ఐఓయస్ సపోర్టును అందిస్తుంది.
కాగా విండోస్ సిస్టమ్ బ్లూటూత్ ద్వారా మెసేజ్ పంపుతుందని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.ఒకవేళ.రిసీవర్ ఐఫోన్‌ను ఉపయోగిస్తుంటే ఆపిల్ వాటిని ఐమెసేజ్‌గా మార్పు చేస్తుంది.
అప్‌డేట్ చేసిన ఫోన్ లింక్ యాప్ ఫుల్ చాట్ హిస్టరీని మాత్రం అందించదని గుర్తు పెట్టుకోవాలి.అంతేకాకుండా, ఫోన్ లింక్ యాప్‌లో మైక్రోసాఫ్ట్ బ్లూ లేదా గ్రీన్ బబుల్స్ ఉపయోగించదు.
అప్‌డేట్ చేసిన ఫోన్ లింక్ యాప్ ఐఫోన్లలో సేవ్ చేసిన ఫొటోలను ప్రదర్శించదు.ఇకపోతే మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఐక్లౌడ్ ఫొటోలను లోకల్ విండోస్ ఫొటోల యాప్‌లోకి సింకరైజ్ ఆప్షన్ అందిస్తుంది.
మైక్రోసాఫ్ట్ 2023 చివరిలో నెక్స్ట్ ప్రధాన విండోస్ 11 అప్‌డేట్‌తో ఫీచర్‌ను రిలీజ్ చేసే అవకాశం కలదు.