యాపిల్ గ్యాడ్జెట్స్ అంటే యువతకు యమా క్రేజ్ అని చెప్పుకోవాలి.అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా యాపిల్ తన గ్యాడ్జెట్స్‌లో సరికొత్త ఫీచర్లను ఎల్లపుడు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో యాపిల్ ప్రొడెక్ట్స్ వాడడం అనేది ఓ స్టేటస్ సింబల్ అయిపోయింది.యాపిల్ ఫోన్స్ తర్వాత ఎక్కువ యాపిల్ స్మార్ట్ వాచ్‌లు ఇపుడు ఎక్కువ మంది మనస్సును గెలుచుకున్నాయి.
దాంతో ప్రస్తుతం యాపిల్ వాచ్‌ల్లో కెమెరా ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే యాపిల్ స్మార్ట్ వాచ్ కెమెరాకు పెటెంట్ రైట్స్ వచ్చినట్లు తెలుస్తోంది.యాపిల్ డిటాచబుల్ వాచ్ బేస్‌డ్ కెమెరా రిటెన్షన్ సిస్టమ్‌కు పెటెంట్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ వార్తలను బట్టి భవిష్యత్‌లో యాపిల్ స్మార్ట్‌వాచ్‌లకు కెమెరాలు వచ్చే అవకాశం ఉంది.
వినియోగదారులు వాచ్ దిగువున ఉన్న కెమెరాల నుంచి ఫొటోలు తీసి వాటిని స్నాప్ చేసేలా టెక్నాలజీని యాపిల్ అభివృద్ధి చేస్తోందని భోగట్టా.

యాపిల్ నెస్ట్ మెకానిజం ద్వారా వాచ్‌ను స్పీడ్‌గా చేతినుంచి తీసి వినియోగదారుడు కెమెరా యాక్సెస్ చేసుకునేలా రూపొందించే అవకాశం ఉందని కొన్ని నివేదికలా బయటకు పొక్కింది.అయితే మార్కెట్‌లో యాపిల్ ఒక్కటే మొదటి సారిగా స్మార్ట్ వాచ్ కెమెరాను రిలీజ్ చేయలేదు.గతంలో సామ్‌సంగ్ గెలాక్సీ గెర్ స్మార్ట్ వాచ్‌లో కూడా 1.91 MP కెమెరాతో వచ్చిందనే విషయం తెలిసే ఉంటుంది.అయితే స్మార్ట్ వాచ్‌లో కెమెరాలు ఆహ్వానించదగిన పరిణామమే అయినా గోప్యతా సమస్యలు కూడా పెంచే అవకాశం లేకపోలేదు.







