భారీ సంఖ్యలో చైనా గేమింగ్ యాప్ లని తొలగించిన యాపిల్

కరోనా మహమ్మారి వైరస్ చైనా నుంచి దిగుమతి అయ్యిందని, దానిని ప్రపంచ దేశాల మీదకి వారు బయో వెపన్ గా వదిలారని చాలా దేశాలు నమ్ముతున్నాయి.

అయితే ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి చైనా ప్రభుత్వం భారత్ ని రెచ్చగొడుతూ కరోనా నుంచి ప్రపంచ దృష్టిని మార్చే ప్రయత్నం చేస్తుంది.

అందులో భాగంగానే గాల్వాన్ వ్యాలీలో 20 మంది భారతీయుల మీద కిరాతకంగా దాడి చేసి చైనా సైనికులు హత్య చేశారు.అయితే ఈ దుశ్చర్య చైనాని ప్రపంచ దేశాల ముందు మరింత దోషిగా నిలబెట్టింది.

ఇండియాలో ప్రజల ఆగ్రహానికి గురై ఇప్పుడు ఆ దేశ మార్కెట్ మీద పడింది.భారత్ మార్కెట్ లో పెత్తనం చేస్తూ వేల కోట్లు ఆర్జిస్తున్న చైనా యాప్ లని భారత్ ప్రభుత్వం నిషేధించింది.

దీంతో ఆ దేశం సుమారు 45 వేల కోట్ల రూపాయిలు నష్టపోయింది.ఇదే దారిలో అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా వెళ్తున్నాయి.

Advertisement

దేశీయ భద్రతని దృష్టిలో పెట్టుకొని ఆ దేశ యాప్ లని నిషేధించాలని భావిస్తున్నాయి.మరో వైపు తాజాగా చైనా యాప్‌ స్టోర్‌లోని చైనాకి చెందిన 4,500 మొబైల్‌ గేమ్స్‌ను తొలగిస్తూ యాపిల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

కేవలం మూడు రోజుల వ్యవధిలో యాపిల్‌ ఇంత భారీగా యాప్‌లను తొలగించింది.మొబైల్ గేమింగ్‌ లైసెన్స్‌ నింబంధనల్లో యాపిల్ పలు సంస్కరణలకు చేపట్టింది.

ఇందులో భాగంగానే యాపిల్‌ చైనా గేమ్స్‌ను‌ తొలగించింది.చట్టపరమైన అనుమతి లేని గేమ్స్‌ ను తాము ఉండనివ్వబోమని తేల్చి చెప్పింది.

ఈ దెబ్బతో చైనా డిజిటల్ కమ్యునికేషన్ సంస్థలు వేల కోట్ల రూపాయిలు నష్టపోనున్నట్లు తెలుస్తుంది.వరుసగా తగులుతున్న దెబ్బలకి చైనా ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..
Advertisement

తాజా వార్తలు