మంత్రి అప్పలరాజుకు పదవి వియోగం తప్పదా?

సీఎం కార్యాలయం నుంచి అర్జెంటుగా రమ్మని కబురు అందింది అన్న వార్తల నడుమ శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, పశుసంవర్ధక శాఖ మంత్రి సిదీరి అప్పలరాజు( Seediri Appalaraju ) వర్గం మల్ల గుల్లాలు పడుతుంది .మంత్రిగా సీఎంఓ ఆఫీస్ కి వెళ్లే అప్పలరాజు మాజీ మంత్రిగా తిరిగి వస్తారంటూ సామాజిక మాధ్యమాలలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి .

 Appalaraju Will Lost His Ministry , Seediri Appalaraju, Ysrcp, Balineni Srinivas-TeluguStop.com

మొదటి విడతలో మంత్రిగా ఛాన్స్ కొట్టేసిన అప్పలరాజు రెండో విడతలో పదవి కోల్పోతారని అంచనాలు వచ్చినా పదవి నిలబెట్టుకోవడంలో విజయం సాధించారు.అయితే ఎన్నికలు దగ్గర్లో ఉన్నందున సామాజిక సమతుల్యత సాధించడం కోసం, కొన్ని వర్గాలను సంతృప్తి పరచడంలో భాగంగా మరొకసారి మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి జగన్ నడుంకట్టారు .దానిలో భాగంగానే కొంతమంది కొత్త ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.కొడాలి నాని కి మరొకసారి అవకాశం వస్తుందని భావిస్తుండగా తోట త్రిమూర్తులకు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivasa Reddy ) కి కొత్తగా మంత్రి అవకాశం వస్తుందని వార్తలు వస్తున్నాయి.

Telugu Ap, Ys Jagan, Ysrcp-Telugu Political News

పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఆయన పనితీరు పూర్తిస్థాయి సంతృప్తికరంగా లేదని, గడపగడప కార్యక్రమంలో కూడా ఆయన యాక్టివ్గా పాల్గొనలేదని సర్వే రిపోర్టులు వచ్చినందున ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించి పూర్తిస్థాయిలో ప్రజల్లో నిలదొక్కుకోవాలని వచ్చే ఎన్నికలలో గెలవడం కోసం సర్వశక్తులు ఒడ్డాలని అధిష్టానం నుంచి సూచనలు ఇవ్వడానికే ఆయనను పిలిపించారని వైసిపి శ్రేణులు అంటున్నాయి.మరి ఉత్తరాంధ్రలో బలమైన నాయకుల్లో అప్పలరాజు ఒకరు.ఎన్నికల సమీపంలో ఉన్నందున అలాంటి బలమైన నేతను తొలగించే సాహసం జగన్( YS Jagan ) చేస్తారా అన్నది ప్రశ్న.

Telugu Ap, Ys Jagan, Ysrcp-Telugu Political News

ఏదిఏమైనా పూర్తిస్థాయి సర్వే రిపోర్ట్ లో తెప్పించుకున్న అధిష్టానం తాను చేయాలనుకుంటున్న మార్పులను ఎట్టి పరిస్థితుల లోనూ చేసి తీరుతుందని మరొకసారి అధికారం లోకి రావాలంటే మార్పులు చేయాల్సిందే అని బలంగా నిర్ణయించుకున్నందున ఎలాంటి నేతనైనా మొహమాటం లేకుండా తప్పిస్తుందని అంచనాలు వస్తున్నాయి.ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం అని గ్రహించిన అధిష్టానంఈ విషయంలో కఠినంగానే ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయిమరి అప్పలరాజు మంత్రి పధవి భవితవ్యం ఏమిటో మరో రెండు రోజుల్లో స్పష్టత వస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube