డీప్ న్యూడ్ యాప్ కలకలం....ఇది ఎంత డేంజరో తెలుసా

ముఖ కవళికలని మార్చేసి మాట్లాడని వాటిని మాట్లాడినట్లుగా చూపించే టెక్నాలజీ డీప్ ఫెక్స్ గత కొన్నేళ్లుగా ఈ టెక్నాలజి పలు వివాదాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా మరో టెక్నాలజీ ఒకటి వచ్చింది.

అయితే ఈ టెక్నాలజీ తో మేలు కన్నా కీడే ఎక్కువ జరగనున్నట్లు అర్ధం అవుతుంది.ఆ నూతన టెక్నాలజీయే డీప్ న్యూడ్, ఇది ఒక అప్లికేషన్.

అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ యాప్ లో ఫోటో అప్ లోడ్ చేసి ఒక్క క్లిక్ చేస్తే చాలు ఆ ఫోటోలో ఉన్న వారి దుస్తులు మాయమైపోతాయట.అసలు దుస్తులు లేకుండా ఫోటో లు దిగారు అన్న రేంజ్ లో ఫోటో లో ఉన్న వారు నగ్నంగా కనిపిస్తారట.

అయితే ఈ యాప్ కేవలం ఆడవాళ్ల ఫోటోలకు మాత్రమే పనిచేస్తుందట.దీనితో ఇప్పుడు మహిళల్లో,అమ్మాయిలలో తీవ్ర కలవరం మొదలైంది.

Advertisement

ఇప్పటికే మార్ఫింగ్ ఫోటో లతో సోషల్ మీడియా లో పలువురు మహిళలు,అమ్మాయిలు సవాళ్ళను ఎదుర్కొంటుండగా,ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ కారణంగా మహిళలకు మరింత కీడే జరుగుతుంది అన్న విషయం అర్ధం అవుతుంది.గత నెలలో ఈ డీప్‌న్యూడ్ వెబ్‌సైట్ లాంచ్ అవ్వగా ఆ తర్వాత యాప్‌ను సదరు కంపెనీ రిలీజ్ చేసింది.

అయితే పెయిడ్ వర్షన్ ధర 50 డాలర్లు కాగా ఈ యాప్‌ను ఇప్పటివరకు ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారో తెలియదు కానీ ఈ యాప్ వల్ల అమ్మాయిలకు ముప్పు తప్పదన్న వాదన వినిపిస్తుంది.ఇప్పటికే ఫోటోలను, వీడియోలను మార్ఫ్ చేసి అమ్మాయిల్ని లోబర్చుకునే కీచకులు ఉన్న ఈ సమాజంలో ఇప్పుడు ఈ డీప్ న్యూడ్ టెక్నాలజీని ఉపయోగించి ఆ కీచకులకు ఆ పని మరింత సులభతరం చేయనుంది.

కావున ఈ యాప్ తయారు చేయడంపై అనేక వర్గాల్లో కలవరం రేగుతోంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ యాప్ ను సదరు సంస్థ ఆపేసినట్లు తెలుస్తుంది.

ఎవరైనా మహిళల ఫోటోలను నగ్నంగా మార్చేసే అవకాశం ఉందని, పోర్న్‌ను ప్రోత్సహించేలా ఉందన్న ఆందోళన కనిపిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ కూడా ఈ యాప్ ని ఆపేసినట్లు సమాచారం.

Krishna , Vijaya nirmala : కృష్ణ గారి ఆస్తి కంటే విజయ నిర్మల ఆస్తి ఎక్కువట నిజమేనా..?
Advertisement