ఎన్టీఆర్ జిల్లా నందిగామ: కాంగ్రెస్ పార్టీ లోకి షర్మిల రాకపై ఎపి పిసిసి అధ్యక్షుడు రుద్రా రాజు కామెంట్స్.షర్మిల రాక పై కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకోవడం మిగిలింది.
షర్మిల పార్టీ తెలంగాణకు చెందిన పార్టీ కాబట్టి అమె నిర్ణయం బట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది.హై కమాండ్ నిర్ణయం తప్పకుండా పాటిస్తాం.
షర్మిల పార్టీలోకి రావడం కాంగ్రెస్ కు బ్లాస్టింగ్ లాంటిది.షర్మిల రాకతో రాజశేఖరరెడ్డి గారి కూతురు, కావడం ప్రత్యేక ఆకర్షణగా, బలమైన సామాజిక నేపథ్యం తో కాంగ్రెస్ కు కలిసివస్తుంది.
కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే తప్పకుండా ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ స్వాగతిస్తుంది.కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే షర్మిల చేరికపై తనతో ఇంకా చర్చించలేదు.