టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్( Tammineni Sitaram ) మరోసారి నోటీసులు పంపారు.ఈ మేరకు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, బలరాం, వాసుపల్లితో పాటు మద్దాల గిరికి స్పీకర్ నోటీసులు అందించారు.
ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను గతంలో విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ వంశీ, బలరాం, మద్దాల గిరి( Vamsi, Balaram, Maddala Giri ) విచారణకు హాజరు కాలేదు.ఈ క్రమంలోనే స్పీకర్ కార్యాలయం మరోసారి వారికి నోటీసులు పంపింది.అలాగే ముగ్గురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ తమ్మినేని సీతారామ్ నోటీసులు ఇచ్చారు.ఇవాళ విచారణకు హాజరు కావాలని ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి,మేకపాటికి నోటీసులు అందజేశారు.