ఏపీలో అమరావతి అంశం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.రాజధానిగా అమరావతి కాదని సిఎం జగన్ నిర్ణయం తీసుకున్నది మొదలు ఇప్పటివరకు అమరావతి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.
ఇక డిసెంబర్ లో రాజధాని మార్పు ఉంటుందని, డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా తాను పాలన సాగిస్తానని సిఎం జగన్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు.ఇక డిసెంబర్ నెల రావడంతో సిఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతారా ? లేదా అమరావతినే అంటిపెట్టుకొని ఉంటారా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.అయితే ఏపీ రాజధానిగా అమరావతి( Amaravati )ని గుర్తిస్తూ కేంద్రప్రభుత్వ ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దీంతో రాజధాని విషయంలో జగన్ నెక్స్ట్( Ys jagan ) ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.అయితే జగన్ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులను ప్రతిపాధించిన తరువాత అమరావతి రైతుల( Farmers ) నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.జగన్ సర్కార్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా హైకోర్టును కూడా ఆశ్రయించారు రైతులు.
ఆ తరువాత రాజధాని మార్పుకు బ్రేక్ పడడం, మూడు రాజధానుల అంశం ఆగిపోవడం వంటి పరిణామాలు చక చక జరిగిపోయాయి.అయితే ఈ నెలలో రాజధాని మార్పుకు సంబంధించి వైఎస్ జగన్ తుది నిర్ణయానికి రావాల్సి ఉండగా.
మరోసారి అమరావతి రచ్చ పోలిటికల్ హీట్ పెంచుతోంది.

ఇకపోతే ఈ నెల 17న అమరావతి ఉద్యమ సభ జరనుంది.ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇద్దరు హాజరు కానున్నారు.అమరావతి ఉద్యమం మొదలై ఈ నెల 17తో నాలుగేళ్ళు పూర్తి అవుతుండడంతో బహిరంగ సభకు టీడీపీ జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి.
ఇక ఎన్నికల ముందు రాజధాని అంశాన్ని మరింతగా ప్రస్తావిస్తూ జగన్ ను ఇరకాటంలో పడేసేందుకు చంద్రబాబు, పవన్ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి అమరావతి రాజధానికి సంబంధించి వైఎస్ జగన్ ఎలా అడుగులు వేస్తారో చూడాలి.