YS Sharmila : నేడు నర్సీపట్నంలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పర్యటన..!

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) జిల్లాల పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆమె ఇవాళ నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ మేరకు నర్సీపట్నం( Narsipatnam )లో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో షర్మిల పాల్గొననున్నారు.

సాయంత్రం పాడేరు( Paderu )లో పర్యటించనున్న షర్మిల 5 గంటలకు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరుకానున్నారు.అలాగే రేపు నగరి నియోజకవర్గంలో ఆమె పర్యటించనున్నారు.ఉదయం రచ్చబండ, సాయంత్రం బహిరంగ సభలో పాల్గొననున్నారు.

అయితే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యమని వైఎస్ షర్మిల చెబుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
ఫెయిల్ అయిన సర్కస్ స్టంట్.. భయంకర బైక్ యాక్సిడెంట్ వైరల్..?

తాజా వార్తలు