ఏపీ మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ బ్రదర్స్ ను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు.కడప జిల్లాకు చెందిన స్మగ్లింగ్ సోదరులు షేక్ చంపతి లాల్ బాషా, షేక్ చంపతి జాకియార్ లను అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లాలోని చాపాడు మండలానికి చెందిన సోదరులపై 89 ఎర్రచందనం కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ కు సోదరులు పాల్పడుతున్నారని వెల్లడించారు.
కాగా అక్రమ రవాణా వాహనాలను పోలీసు యూనిఫాంలో అడ్డగించి సినీ ఫక్కీలో హైజాక్ చేస్తున్నట్లు గుర్తించారు.అనంతరం నిందితుల దగ్గర నుంచి రూ.20 లక్షలు ఖరీదైన 31 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.







