తిట్ల దండకంతో బాబు లోకేష్ పై నాని ఫైర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ పై ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు ఏపీ మంత్రి కొడాలి నాని.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు విమర్శించనంత స్థాయిలో వ్యక్తిగతంగానూ అసభ్య పదజాలంతో నూ చంద్రబాబు పై నాని విరుచుకుపడుతూ ఉంటారు.

 Ap Minister Kodal Nani Sensational Comments On Chandrababu Lokesh Ap Minister, K-TeluguStop.com

  ఈ విషయంలో ఆయన పై అనేక విమర్శలు వస్తున్నా,  ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.వైసిపి ప్రభుత్వం పైన జగన్ పైన టిడిపి నాయకులు ఎవరు కామెంట్ చేసినా ఇదే రేంజ్ లో నాని విరుచుకుపడుతూ ఉంటారు.

  ఇదే విధంగా మరోసారి నాని తన నోటికి పని చెప్పారు.మద్యం విషయంలో టిడిపి వైసిపి ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉండడం పై కొడాలి నాని స్పందించారు.‘మద్యం అమ్మకాలను ప్రోత్సహించింది చంద్రబాబు.మద్యం అమ్మకాల ద్వారా కమిషన్ తీసుకుని ఆస్తులు పెంచుకున్నది చంద్రబాబు.

  కమీషన్లకు కక్కుర్తి పడి బార్లకు ఐదేళ్లు లైసెన్స్ ఇచ్చారు.
      బార్ల కి గతంలో కేవలం రెండేళ్ళ అనుమతులు ఉండేవి.

అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇంట్లో కూర్చుని మాట్లాడుతున్నారు.అడ్డమైన బ్రాండ్లకు చంద్రబాబు అనుమతి ఇచ్చారు.

మనం ఏం చెప్తే అది నమ్మే ప్రజలు ఉన్నారు అనుకునే 420 బ్యాచ్ అది.వాళ్లు తమ మీడియా ద్వారా అబద్ధాలు చెబుతున్నారు.సి బ్రాండ్ ఎల్ బ్రాండ్లకు చంద్రబాబు ఎలా అనుమతి ఇచ్చారో రాష్ట్రం అంతా చూసింది.ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది.
   

Telugu Ap, Chandrababu, Lokesh, Ysrcp-Telugu Political News

    దేనికీ పనికి రాని చంద్రబాబుని అల్లుడు ని చేసుకుంటే ఔరంగజేబు లాగా మారాడని ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు.వెన్నుపోటు కుట్రలు,  కుతంత్రాలకు పేటెంట్ చంద్రబాబు.175 నియోజక వర్గాలను 175 జిల్లాలు చేయమని లోకేష్ అడుగుతున్నాడు.అప్పట్లో కుప్పం ను డివిజన్ చేయాలని చంద్రబాబు ఎందుకు అనిపించలేదు ? ఇప్పుడు సీఎం జగన్ కు ఎలా ఉత్తరాలు రాస్తాడు ? కాస్తయినా చంద్రబాబుకు సిగ్గు లేదా ? అభివృద్ధి పనులను అడ్డుకుంటే టిడిపి రాజకీయ భవిష్యత్తుకు జనం సమాధి కడతారు.ఎన్నికల వరకు ఈ 420 బ్యాచ్ ను భరించక తప్పదు ” అంటూ కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube