చెన్నై, మార్చి 24,2022 : లింగ అసమానతలను రూపుమాపుకోవడంతో పాటుగా తమ భార్యలతో భారం పంచుకోవాలని కోరుతూ లాండ్రీ బ్రాండ్ ఏరియల్ ఓ కార్యక్రమం నిర్వహించింది.దక్షిణాది తారలు శాంతను భాగ్యరాజ్ మరియు సిబీ భువన చంద్ర లు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా ఇతర మగవారితో భారాన్ని సమానంగా పంచుకుంటున్న మగవారు, తమ భార్యతో మాత్రం ఎందుకు పంచుకోరు అని ప్రశ్నించారు.
లింగ సమానత్వం గురించి 2015 నుంచి ఏరియల్ చర్చను నిర్వహిస్తూనే ఉంది.
ఈ కార్యక్రమంలో శాంతను భాగ్యరాజ్ మాట్లాడుతూ ‘‘మగవారిగా మాకు ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసుకానీ ఆ పనులు చేయడానికి సిగ్గు పడుతుంటాం.
అదే హాస్టల్స్‌లో ఉన్నప్పుడు మాత్రం స్నేహితులతో కలిసి ఈ భారం పంచుకుంటూనే ఉన్నాం.మరి భార్య దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఈ మార్పు? ఆడ, మగ ఇద్దరూ సమానమే అంటున్న ఈ ప్రచారం నా హృదయాన్ని తాకింది.మూస ధోరణికి చెక్ పెడదాం .ఇంటిలో బాధ్యతలన సమానంగా పంచుకుందాం’’అని అన్నారు.
సిబీ భువన చంద్ర మాట్లాడుతూ ‘‘ఇంటిలో లింగసమానత్వం అంశాన్ని ఏరియల్ సీరియస్‌గా తీసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను.మనం ఇతరులను సమానంగా చూసినప్పుడు భారం కూడా పంచుకోగలమనే భావనను నమ్ముతున్నాను’’ అని అన్నారు.







