చదువుల కోసమో , ఉద్యోగాల కోసమే ,లేక అ ఏదైనా వ్రుత్తి కోసమే ఎంతో మంది ఏపీ నుంచీ తెలుగు ప్రజలు ఎన్నో దేశ విదేశాలకి తరలి వెళ్తూ ఉంటారు.తమ భార్యా బిడ్డలని ,తల్లి తండ్రులని, వదిలి మరీ జీవనం కోసం తరలి పోతూ ఉంటారు ముఖ్యంగా ఎంతో మంది ఏపీ నుంచీ కువైట్ ,దుబాయ్ వంటి దూర దేశాలకి ఎంతో మంది పేద కుటుంబాలు వెళ్తూ ఉంటాయి.
అయితే ఇలా వెళ్ళే వారికోసం బీమా పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్స్ తెలుగుసొసైటీ సహకారంతో సెర్ప్ ఆధ్వర్యంలో భీమా పథకాన్ని అమలుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.చంద్రన్న బీమా తరహాలో ఈ పథకానికి రూపకల్పన చేశారు.ఒకసారి బీమా ప్రీమియం చెల్లిస్తే, మూడేళ్ల దాకా ఈ పథక లబ్ధిని పొందవచ్చు.దీనికోసం లబ్ధిదారులు కట్టాల్సింది కేవలం రూ.150.రూపాయలు మాత్రమే ప్రవాసాంధ్ర ఉద్యోగులు ఈ పథకంలో చేరడానికి అర్హులు.18 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
అయితే ఈ పధకం కట్టడానికి సంభందిత వ్యక్తీ మాత్రమే ఉండవలసిన అవసరం లేదు విదేశాల్లో ఉన్న తమవారి తరఫున రాష్ట్రంలోని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రీమియం కట్టి పేరు నమోదు చేయించే వెసులుబాటు కల్పించారు.ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 16వ తేదీదాకా నమోదు ప్రక్రియ కొనసాగుతుంది.లబ్ధిదారులు లేక వారి తరఫు కుటుంబసభ్యులు పూర్తిచేసిన తమ దరఖాస్తులను వెలుగు సభ్యులకు లేక ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్స్ తెలుగుసొసైటీ కో-ఆర్డినేటర్లకు అందించాల్సి ఉంటుంది.
ఈ పధకం ఉపయోగాలు ఏమిటంటే:
ఈ పధకంలో చేరిన వ్యక్తి విదేశాల్లో ప్రమాదవశాత్తు మరణిస్తే.మృతదేహాన్ని విమానంలో తీసుకొచ్చి, స్వస్థలంలో ఆయన కుటుంబసభ్యులకు అప్పగించేదాకా, అయ్యే ఖర్చులో కొంత ప్రభుత్వం భరిస్తుంది.మృతదేహానికి, వెంట ఉన్న వ్యక్తికి అయ్యే విమాన ఖర్చులను పెట్టుకొంటుంది.
విమానంలోంచి ఆ మృతదేహాన్ని దించి.అంబులెన్స్‌లో స్వస్థలం వరకు తరలిస్తారు.
నిజానికి, ఇదంతా వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం.ఇప్పుడు ఈ బీమా పథకంతో ప్రభుత్వం అండ బాధితులకు ప్రతి అడుగులో లభించే వీలు కలిగింది.
అంతేకాదు లబ్ధిదారు శాశ్వత అంగవైకల్యం పొందితే, ఆయన కుటుంబానికి రూ.10 లక్షలు బీమా అందిస్తారు.ఆ స్థితిలో ఉన్న ఆయనను స్వదేశం తీసుకెళ్లాలని కుటుంబసభ్యులు భావిస్తే, ఆయనకు, వెంట ఉన్న సహాయకుడికి విమానంలో సాధారణ టికెట్‌ను బుక్ చేస్తారు.ఏదైనా ప్రమాదంలో గాయపడిన సందర్భంలో.
అందుకు లబ్ధిదారుకు అయ్యే చికిత్సఖర్చుల కింద రూ.ఒక లక్ష చెల్లిస్తారు.