ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను( Sankranti holidays ) పొడిగించింది.షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తారీఖు స్కూల్స్ రీ ఓపెన్ చేయాలి.
కానీ తాజాగా సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించడం జరిగింది.దీంతో ఈనెల 22న పాఠశాలలు మళ్ళీ తిరిగి తెరుచుకోనున్నాయి.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థుల విజ్ఞప్తితో సెలవులను పొడిగించినట్లు తెలిపారు.
తెలుగువారు జరుపుకునే పండుగలలో సంక్రాంతి అతిపెద్దది.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో( AP Governament ) సంక్రాంతి చాలా ఘనంగా నిర్వహిస్తారు.
ముఖ్యంగా గోదావరి జిల్లాలలో సంక్రాంతి పండుగ హడావిడి వాతావరణం ఓ రేంజ్ లో ఉంటుంది.దీంతో అక్కడ పండుగను తిలకించటానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా జనాలు వస్తుంటారు.
ముఖ్యంగా కోడిపందాలు చూడటానికి.ఆడటానికి గోదావరి జిల్లాలకు క్యూ కడతారు.
ఈసారి గోదావరి జిల్లాలలో కోడి పందాలలో… 500 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు వార్తలు వస్తున్నాయి.గతంతో పోల్చుకుంటే ఈసారి సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరిగింది.
ఇదిలా ఉంటే సంక్రాంతి సెలవులు మొదట ఈనెల 9 నుంచి 18 వరకు ముందు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.కానీ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుండి ఒత్తిడి రావడంతో మరో మూడు రోజులు సెలవులు పొడిగించడం జరిగింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్( Suresh Kumar ) ఆదేశాలు జారీ చేశారు.