అమరావతి: ఎల్లుండి నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె.సమ్మె కు సంబందించిన పోస్టర్ రిలీజ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు.
జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ కామెంట్స్.రెండేళ్లుగా సమస్యలపై చర్చలు జరుపుతున్న పరిష్కారం లేదు.
గత నెల 21 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం.రేపు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులు తిరిగి ఇచ్చేస్తాం.12 సమస్యలపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత లేదు.
వేతన సవరణ పేరుతో జీతాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై స్పష్టత ఇవ్వడం లేదు.మిగతా ఉద్యోగులతో మమ్మల్ని పోల్చవద్దు.2022 ఏప్రిల్ నుంచి వేతన సవరణ జరగాల్సి ఉన్నా…జరగలేదు.వాచ్ మాన్ నుంచి ఇంజినీర్ వరకూ అందరూ సమ్మెలో పాల్గొంటారు.
ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం, యాజమాన్యమే బాద్యత వహించాలి.







