మయంలో ఏపీ దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ., ఏపీ ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి.,టీడీపీ వైజాగ్ ఎమ్మెల్యే గణబాబు., ఏపీ ఎంపీ గోరంట్ల మాధవ్., ఎంపీ తెలంగాణ దామోదర్ రావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా….
ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.ఆలయం వెలుపల ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ….
రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పధకాలతో ఇతర రాష్ట్రాలు మనవైపు చూస్తున్నాయన్నారు.
సమర్ధవంతమైన మెకానిజంతో ఎలా ఎలా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని ఆశ్చర్యంగా చూస్తున్నారని అన్నారు.
ముప్పై రెండు ఆలయాలకు మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నామని పేర్కొన్నారు.శ్రీశైలం ఆలయానికి మహా కుంబాభిషేకం కార్యక్రమం జరుపుతామన్నారు.
సంక్షేమాన్ని ఓర్వలేని ప్రతిపక్షం రాదంతం చేస్తూ రాక్షస పాలనా అంటున్నాయని ఆక్షేపించారు.ప్రతిపక్షం చేస్తున్న తప్పులు మల్లి వాళ్లే ఎదుర్కోక తప్పదన్నారు.
ప్రజల ప్రాణాలు బలిగొని., మల్లి అదే తప్పు చేయాలనీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
సభలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలో చంద్రబాబు బాధ్యత వహించాలని చెప్పిన ఆయన….ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు జవాబుదారిగా ఉండాలని కోరారు.
తప్పు వాళ్ళు చేసి పోలీసులు., ప్రభుత్వంపై నెట్టి వేయడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు.
నీతిమాలిన రాజకీయాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ చంద్రబాబే అని ఎద్దేవా చేసారు.ప్రచారం కోసం 12 మందిని చంపాపని చంద్రబాబుకు పశ్చాతాపం లేదన్నారు.
ప్రతీకలు చంద్రబాబుని వెనుకవేసుకొని రావడం సూఛనీయమని తెలిపారు
.