సోనియా, చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి.ఈ క్రమంలో ఎవరికి వారు వివిధ పార్టీల నేతలు ప్రజలలో ఉంటూ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.2019 కంటే 2024 ఎన్నికలు కత్తిమీద సాము అన్న విధంగా పరిస్థితి నెలకొంది.ఏపీలో ప్రజల నాడి ఎవరు కనిపెట్టలేక పోతున్నారు.దీంతో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారన్నది రాజకీయ మేధావులు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొంది.పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల వైఎస్ షర్మిల ( YS Sharmila )కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి.దీంతో ఏపీలో మళ్ళీ కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉన్నాయని పలు పార్టీల నేతలు కామెంట్లు చేస్తున్నారు.

 Ap Deputy Cm Sensational Comments On Sonia And Chandrababu , Ap Deputy Cm Naraya-TeluguStop.com

ఇదే సమయంలో కాంగ్రెస్( Congress ) అధిష్టానం కచ్చితంగా ఏపీలో పార్టీ బాధ్యతలు షర్మిల చేతికి అప్పగించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.పరిస్థితి ఇలా ఉంటే తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నాయకులపై విపక్షాలపై అధికార పార్టీకి చెందిన వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ( AP Deputy CM Narayanaswamy )సోనియా గాంధీ, చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించడానికి కారణం ఆ ఇద్దరే అని విమర్శించారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీని వైయస్ బతికించారు.ఆయన ఫోటో పెట్టుకునే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు.

అని విమర్శించారు.ఎన్టీఆర్ మృతికి కారణమైన చంద్రబాబుకు అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమం పట్టదని మండిపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube