ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు.ఇందులో భాగంగా సాయంత్రం హస్తినకు ఆయన పయనం కానున్నారు.
రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీకానున్నారు.ఈ సమావేశంలో విభజన హామీలు, రాజధాని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుతో పాటు ఎఫ్ఆర్బీఎం, ఆర్థిక సాయంపై చర్చించే అవకాశం ఉంది.ఈనెలలో మోదీతో సీఎం జగన్ సమావేశం కావడం ఇది రెండోసారి.
మోదీతో భేటీ అనంతరం ఆయన పలువురు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.







