తగ్గేదెలే :  మూడు రాజధానులపై జగన్ ముందుకే 

ఏపీలో రాజధాని వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది.టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ నిర్మాణాలు చేపట్టగా, వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలు ను న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు ప్రయత్నించినా, చివరకు కోర్టు ఇబ్బందులు తదితర కారణాలతో ఆ ప్రతిపాదనను అధికారికంగా రద్దు చేసింది వైసిపి ప్రభుత్వం.

 Ap Cm Jagan More Interested On Three Capitals For Ap Details, Ap Capital, Jagan-TeluguStop.com

అయితే మరోసారి ఎటువంటి న్యాయ ఇబ్బందులు లేకుండా మూడు రాజధానులు ఏర్పాటు ప్రక్రియ సక్రమంగా సాగే విధంగా జగన్ ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి కొత్త రాజధాని బిల్లును ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.న్యాయస్థానాల నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త గానే న్యాయ నిపుణుల సూచనలను తీసుకుంటూ, మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

దీనికి అవసరమైన మార్పు చేర్పులు ఇప్పటికే చేపట్టారు.శాసనసభలో ఆమోదం పొందిన తర్వాత పూర్తిస్థాయిలో ఇది బిల్లుగా మారనుంది.

ఏపీ రాజధాని విషయంలో మొదటి నుంచి గందరగోళం ఉండడంతో స్పష్టంగా రాజధాని ఏమిటి అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది.అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు దాదాపు వెయ్యి రోజుల నుంచి ఆందోళనలు చేపడుతున్నారు.

న్యాయస్థానాలూ ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి.అయినా జగన్ ప్రభుత్వం ఈ ప్రక్రియలో వెనకడుగు వేయకూడదని, మూడు రాజధానుల వైపే తమ నిర్ణయం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

మొదట్లో కేంద్ర అధికార పార్టీ బిజెపి అమరావతిని వ్యతిరేకించడంతో పాటు, మూడు రాజధానులకు మద్దతు పలికింది.అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అమరావతిని ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ బిజెపి ఆందోళనలు చేపట్టడంతో పాటు, ఇటీవల ఏపీ బీజేపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు.

Telugu Amaravathi, Ap, Ap Cm, Central, Jagan, Karnool, Telugudesam, Vijayasai, V

తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రైవేటు బిల్లును నిన్న ప్రవేశపెట్టారు.రాజధాని ఏర్పాటుపై శాసనసభకు విశిష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని కోరుతూ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.రాష్ట్రంలో ఒకటి కంటే ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న చట్టానికి ఆర్టికల్ 3 ఏను చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేయాలంటూ విజయసాయిరెడ్డి బిల్లు ప్రవేశపెట్టడంతో, ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తే… మూడు రాజధానుల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి జగన్ అనుకున్నది సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube