వైఎస్ ఆర్ ఆశయాల సాధన కోసం ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ లో నూతనోత్సహం తొణికిసలాడుతుంది.పార్టీని స్థాపించిన తర్వాత మూడో ప్లీనరీ, .
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్లీనరీ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ లోని నేతలతో పాటు, కార్యకర్తల్లోనూ పండుగు వాతావరణం కనిపిస్తుంది.విజయవాడ-గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగర్జున యూనివర్శిటీకి ఎదురుగా నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశం జనసంద్రంగా మారింది.
వైఎస్పార్ ప్రాంగణంగా నామకరణం చేసిన ఈ ప్రాంగణంలో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో ఈ సమావేశాలను వైసీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
వైసీపీ ప్రజా ప్రతినిధులు మొదలు, ఆ పార్టీకి చెందిన వార్డు మెంబర్ల వరకు పార్టీ అధినేత జగన్ పేరుమీద ఆహ్వానాలు పంపారు.దీంతో, పెద్ద సంఖ్యలో ఆ పార్టీ శ్రేణులు ప్లీనరీకి కదిలివచ్చారు.
ప్లీనరీ ప్రాంగణం మొత్తం పార్టీ శ్రేణులతో కిటకిటలాడుతోంది.వైసీపీ ప్లీనరీ ప్రాంగణానికి ఆ పార్టీ అధినేత జగన్ తో పాటు, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ హాజరైయ్యారు.
ఇడుపుల పాయలో వైయస్ సమాధి వద్ద జగన్, ఇతర కుటుంబ సభ్యులందరూ నివాళి అర్పించారు.

ప్లీనరీ సమావేశాల్లో సీఎం జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ .ఓదార్పు యాత్రతో ప్రారంభమైన పోరు ఈనాటికి వైఎస్ ఆర్ పార్టీగా అవతరించిందన్నారు.వైఎస్ ఆర్ ఆశయ సాధనలో తనతో అండగా ఉన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు జగన్.
పార్టీ ప్రారంభం అయిన తర్వాత 13 ఏళ్ల ప్రస్తానంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.ప్రజల ఆశీర్వాదంతో 2019 లో అధికారం చేపట్టినట్లు తెలిపారు.175 స్థానల్లో 151 మందితో అధికారం చేపట్టడం.రాష్ట్రానికి సేవచేసుకునే అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదలు తెలిపారు సీఎం జగన్.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడంమే దుష్టచతుష్టయం పనిగా పెట్టుకుందని ప్రతిపక్షాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు జగన్.ఇవ్వాళ, రేపు జరగబోయే సమావేశాలను జయప్రదం చేయాల్సిందిగా కార్యకర్తలకు, నేతలకు సీఎం జగన్ పిలుపునిచ్చారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాభివృద్ధిలో భాగంగా సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసినట్లు వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి.ముఖ్యంగా పేదరికం చదువులకు అడ్డంకి కాకూడదనే లక్ష్యంతోనే అమ్మఒడి ప్రకటించారు.నాడు-నేడు కింద 16 వేల 450 కోట్ల రూపాయలతో పాఠశాలల ఆధునికరణకు శ్రీకారం చుట్టారు.విద్యార్ధులు ప్రపంచంతో పోటీపడేలా బైజూస్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పార్టీవర్గాలు తెలిపాయి.2014 లో అప్పటి సీఎం చంద్రబాబు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలను మాఫీచేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని గుర్తు చేసారు.కాని 2019 నుంచి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకంటే ప్రజలకు ఎంతో చేసారని వైసీపీ వర్గాలు పేర్కోన్నాయి.2019 సంస్థాగత ఎన్నికల్లో 80 శాతం పైగా వైసీపీ విజయం సాధించడం ఏపీ ప్రజలకు గర్వకారణం అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి.పార్టీ కార్యకలాపాలను మరింత మెరుగ్గా అమలు చేయడానికి తగిన ప్రణాలికలు సిద్ధం చేయాలంటూ ఈ ప్లీనరీ సమావేశాల్లో సీఎం జగన్ నేతలకు దిశ నిర్ధేశం చేయనున్నట్లు తెలుస్తుంది.







