రెండు రోజుల క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులను ఇచ్చిన విషయం తెల్సిందే.విభజన హామీలను నెరవేర్చడంతో పాటు పలు పెండింగ్ విషయాలపై క్లారిటీ ఇవ్వాలంటూ ప్రధానిని కేసీఆర్ కోరడం జరిగింది.
కేసీఆర్ హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే ఏపీ సీఎం జగన్ కూడా అదే విషయాలను విన్నవించేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యాడు.నేడు సాయంత్రం సమయంలో ప్రధానితో దాదాపుగా గంటన్నర పాటు జగన్ చర్చలు జరిపారు.
ప్రధానితో జగన్ జరిపిన చర్చల విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు.కాని విభజన హామీలు నెరవేర్చడంతో పాటు రాజధాని విషయంలో ప్రభుత్వం నిర్ణయంను తెలియజేయడం, పోలవరం రివర్స్ టెండరింగ్‌కు సంబంధించిన విషయాలు ఇలా పలు విషయాలపై ప్రధానితో జగన్ చర్చించడం జరిగింది.
ఏపీకి ప్రధాని నరేంద్ర మోడీ సాయం చేస్తాడనే నమ్మకంను జగన్ వ్యక్తం చేశాడు.గతంలో కూడా జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి విజ్ఞప్తులు చేశారు.కాని అప్పుడు మోడీ సరైన స్పందన తెలియజేయలేదు.ఇప్పుడు మరోసారి కలవడం జరిగింది.
మరి ఇప్పుడైనా ఏపీకి సాయం చేస్తారా అనేది చూడాలి.







