రేపే జగన్ క్యాబినెట్ కీలక ప్రకటన! మంత్రి పదవుల కోసం ఆశావాహులు ఎదురుచూపు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే తన నవరత్నాలని అమలు చేయడం మొదలు పెట్టి మొదటి సంతకం వృద్ధాప్య పించన్ పెంపు మీద పెట్టాడు.

 Ap Cm Jagan Cabinet Announced Tomorrow-TeluguStop.com

అనంతరం కీలక బిల్లులతో ఐఎఎస్, ఐపీఎస్ ల బదిలీ చేసేసాడు.ఇక తాజాగా రైతుల కోసం రైతు భరోసాని అందుబాటులో తీసుకొచ్చాడు.

ఇలా వరుసగా తన పథకాలని అమలు చేస్తూ పరిపాలనలో తన మార్క్ చూపిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు తన మంత్రి వర్గంపై జగన్ ప్రత్యేక ద్రుష్టి పెట్టాడు.

మంత్రి వర్గ ఏర్పాటుపై ఇప్పటి పని పూర్తి చేసిన జగన్ కీలక పదవులలో ఎవరెవరు ఉండాలి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ఇక పార్టీలో ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ముఖ్యమంత్రి జగన్ కేటాయించినట్లు తెలుస్తుంది.

రెడ్డి సామాజికవర్గం నుంచి ఏడుగురికి అవకాశం అలాగే బీసీ నుంచి 6 గురుకి, కాపులో ఇద్దరికి, కమ్మ నుంచి ఇద్దరికి, మాల నుంచి ఇద్దరికి, మాదిగ నుంచి ఒకరికి, గిరిజన ఎస్టీ నుంచి ఒకరికి అలాగే క్షత్రియ, ముస్లిం మైనార్టీ బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి కేబినెట్‌లో చాన్స్ కల్పించినట్లు తెలుస్తోంది.సీనియర్లను, జూనియర్లను కలుపుతూ కేబినెట్‌ను రెడీ చేస్తున్నారు సీఎం జగన్.

క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలకు మంత్రిపదవుల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube