అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ ఈ రోజు విచారణ నిమిత్తం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి, మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా జగన్ తో పాటు హాజరయ్యారు.
అయితే ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా ఆయన సిబిఐ కోర్టుకు హాజరవ్వడం విశేషం.ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ అక్కడ నుంచి నేరుగా కోర్టుకు చేరుకున్నారు.
పాలనా కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉన్న కారణంగా కోర్టు విచారణ నుంచి వ్యక్తిగతంగా తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరిన నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఆయనకు కోర్టు హయారు నుంచి మినహాయింపు ఇచ్చింది.అయితే ఈ రోజు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో జగన్ సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు.
అయితే ఈ కేసులో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా సురేఖ కొండా మురళిలను చేర్చారు.అక్రమాస్తుల కేసులో జగన్ పై 11 చార్జిషీట్లు సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ప్రతీ కేసులోనూ జగన్ ఏ 1 , విజయ్ సాయి రెడ్డి ఏ 2 నిందితులుగా ఉన్నారు.







