చంద్రబాబు మీద జగన్ మీడియా ఎఫెక్ట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద వైఎస్ జగన్ పత్రిక సాక్షి ఎఫెక్ట్ బాగా పడింది.ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని రెండు రోజుల కిందట సాక్షి పత్రిక గణాంకాలతో సహా మంచి కథనం ప్రచురించింది.

 Chandrababu Announces Appsc Recruitment-TeluguStop.com

తెలంగాణాలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేస్తుండగా బాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు ఉందని సాక్షి విమర్శించింది.ఆ కథనం బాబు మీద వెంటనే ప్రభావం చూపించినట్లుగా ఉంది.

టీడీపీ నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా తొందరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.యువతకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నెరవేరుస్తామని చెప్పారు.

సాక్షి పత్రిక చదవొద్దని, అందులో అన్నీ అబద్ధాలు రాస్తారని చెప్పిన చంద్రబాబు సాక్షి కథనానికి ఎందుకు భయపడ్డారు? దాన్ని ఖండించకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎందుకు చెప్పారు? అది వాస్తవం కాబట్టి ఏమీ మాట్లాడలేక పోయారు.ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తీ పత్రికలపై విరుచుకు పడటం మంచిది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube