ఏపీ బీజేపీ పంచాయతీ ఢిల్లీకి చేరింది.ఈ మేరకు కొందరు నేతలు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ మురళీధరన్ తో సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులతో పాటు పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై చర్చించనున్నారని సమాచారం.అయితే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్షుడు సహా నాయకత్వాన్ని మార్చాలని అసమ్మతి నేతలు కోరనున్నారని సమాచారం.







